అంగరంగ వైభవంగా ధరూర్ 100వ మెథడిస్ట్ జాతర లక్షల సంఖ్యలో భక్తుల హాజరు భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న దయానంద్

అంగరంగ వైభవంగా 100 వ ధరూర్ మెథడిస్ట్ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి గత రెండు సంవత్సరాల నుండి కరోనా కారణంగా జాతర మహోత్సవాలు అంతర్గమాత్రాంగానే జరిగాయి ప్రస్తుతం కరోనా భయం లేనందున వివిధ ప్రాంతాల భక్తులు వేలాది లక్షలాదిగా తరలి వచ్చారు కర్ణాటక మహారాష్ట్ర హైదరాబాద్ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలే కాకుండా విదేశాల నుండి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు జాతర ప్రారంభోత్సవం రోజు బిషప్ కుర్ కురే కమల్ కుర్కురే ప్రథమ సందేశాన్ని భక్తులకు వినిపించారు ఏసుప్రభువు జనుల పాపాలను కడిగి వేయడానికి ఏసు మళ్లీ  పూడు తాడని క్రైస్తవుల నమ్మకం ఏసుప్రభు నమ్మినవాడు ఎన్నటికీ చెడిపోడని వారన్నారు ఈసారి జాతర మహోత్సవానికి పది నుంచి పదిహేను లక్షల మంది భక్తజనం హాజరవుతారని జాతర నిర్వాహకులు దయానంద్ తెలిపారు జాతర ఉత్సాహం నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం బస్సు సౌకర్యం రైలు సౌకర్యం ఉచిత ఆటో సౌకర్యం భోజన సదుపాయం వంటి ఏర్పాట్లు చేశారు దేశంలోనే ఎక్కడ లేని విధంగా ధరూర్ జాతరకు దేశ నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు శనివారం ఆదివారం ఇంకా భక్తుల వృద్ధి పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో సిబ్బందికి భారీ స్థాయిలో బందోబస్తు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిషప్ డాక్టర్ ఎం ఏ డానియల్ డాక్టర్ ఆశా డానియల్ బిషప్ ఎన్ ఎల్ కర్ కర్రీ కమలాకర్ కర్రీ జాతర నిర్వాహకులు డిజి దయానంద్ మాథ్యూ జార్జ్ ఆధ్వర్యంలో భారీ స్థాయి ఏర్పాట్లు చేశారు