అండగా ఉండి ఆదుకుంటా

-తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌

మల్హర్‌,నవంబర్‌ 11( జనంసాక్షి); నన్ను నమ్మి వచ్చిన వారందరికి అండగా ఉండి ఆదుకుంటానని తెరాస మంథిని అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ అన్నారు.ఆదివారం పెద్దతూండ్ల ఎస్సీ కాలనికి చెందిన సుమారు వంద మంది యువకులు మహిళలు తెరాస గ్రామశాఖ అద్యక్షుడు అనిపెద్ది రాంబాబు ఆద్వర్యంలో పుట్ట మధుకర్‌ నివాసంలో తెరాస పార్టీలో చేరారు.వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి సాదారంగా అహ్వనించారు.ఈకార్యక్రమంలో జెడ్పీటిసి గోనె శ్రీనివాసరావు తెరాస మండల అద్యక్షుడు ఎండి తాజుద్దిన్‌ యూత్‌ మండల అద్యక్షుడు అజ్మీర బాలాజి ఇనుముల సతీష్‌ నాగేశ్వర్రావు పి మల్లేష్‌ జె లక్ష్మన్‌ సారయ్య రఘుపతి రాజు తదితరులు పాల్గోన్నారు.