అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయండి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

ప్రజలకు అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా చేయాలని
 వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదేశించారు మంగళవారం రాత్రి మీతో నేను”కార్యక్రమంలో భాగంగా మోమిన్ పేట్* మండల పరిధిలోని బాల్ రెడ్డి గూడ పర్యటించారు.
తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కెసిఆర్*కల్పించిన సువర్ణావకాశంతో బాల్ రెడ్డి గూడ నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిందని అభివృద్ధికి మరిన్ని అవకాశాలు ఏర్పడ్డాయన్నారు.బాల్ రెడ్డి గూడ, చీమలదరి మరియు పరిసర గ్రామాలలో  విద్యుత్ అంతరాయాలు మళ్లీ మళ్లీ ఏర్పడుతున్నాయని ప్రజలు తెలుపగా.ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారుల ను ఆదేశించారు.తెలంగాణ ప్రభుత్వం రైతులకు ప్రమాదవశాత్తు మరణిస్తే  *రైతు భీమా* కల్పిస్తుందని రైతు భీమాకు దరఖాస్తు చేసుకోలేని రైతులు ఇంకా ఎవరైనా ఉంటే మరియు కొత్త పాస్ పుస్తకాలు వచ్చినవారు దరఖాస్తు చేసుకోవాలని, అందుకు రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారుగ్రామంలో అవసరమైన వీధులలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి, గ్రామంలో మరియు పంటపొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని, నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ మంచినీటి నల్లా కనెక్షన్ ప్రతీ ఇంటికి కచ్చితంగా ఇవ్వాలని, లీకేజీలు లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ… సురక్షిత మంచి నీటి సరఫరా చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రకళ ఎంపీపీ వసంత వైస్ ఎంపీపీ మానస మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు హరి శంకర ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు డి వెంకట్ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఎంపీడీవో శైలజ రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు