అంతర్జాతీయ పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ నూతన కమిటీ ఎన్నిక.
సదాశివనగర్ న్యూస్ : ఆగస్టు 08(జనంసాక్షి)
పద్మశాలియుల అభివృద్ధి కోసమే శ్రీ భావనా ఋషి అంతర్జాతీయ పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని అంతర్జాతీయ పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ అధ్యక్షులు సిద్ధాంతి శ్రీ గోలీ ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం నందు ఆదివారం నూతన కార్యవర్గ కమిటీని ఎన్నుకోవడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.ఐక్యమత్యంతోనే అన్ని సాధించవచ్చని,అందుకే పద్మశాలియులందరు కలసి మెలసి వుంటూ సమాజంలో ఉన్నత పదవులు పొంది ముఖ్యపాత్ర పోషించాలన్నారు.ముక్యంగా యువకులలో ప్రశ్నించేతత్వం రావాలని రాజకీయంగా ఎదగలన్నారు.అంతర్జాతీయ పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ యొక్క వీధి విధానాలు,వాటి సిద్ధాంతాల గురించి వివరించారు.ట్రస్ట్ ద్వారా పద్మశాలియులకు భవిష్యత్తు లో ఎన్ని ఉపయోగాలున్నాయో వారికి తెలియజేశారు.
అనంతరం నూతన మండల కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకొని వాళ్లకు అప్పాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.శ్రీ భావనా ఋషి ట్రస్ట్ మండల అధ్యక్షులుగా మామిడాల శ్రీనివాస్ గారిని,మండలం ఇంచార్జి మరియు జిల్లా డైరెక్టర్ గా గుంటుకు రాములు గారిని,మండలంలోని కల్వరాల్ గ్రామానికి రాజశేఖర్ ను,తుక్కజివాడికి గంగాధర్ ను,తిమ్మాజీవాడికి రాజేశ్ ను, డైరెక్టర్ లుగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో జాతీయ కమిటీ డైరెక్టర్ భీమసారి సత్యం, కామారెడ్డి జిల్లా ఇంచార్జి కాముని సుదర్శన్,మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు బిట్ల శంకర్,ఆయా గ్రామాల పద్మశాలి నాయకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.