అంతర్జాతీయ సెమినార్‌లో హస్నత్‌

నిజామాబాద్‌, జనవరి 4 (): పట్టణంలోని టేకి మసీద్‌ ప్రాంతానికి చెందిన హస్నత్‌ గుంటూరు జిల్లాలో నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈనెల 14, 15 ,16 తేదీల్లో నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్‌లో పాల్గొన్నారు. హస్నత్‌ ప్రస్తుతం పట్టణంలోని ప్రజ్ఞ ఐఐటి అకాడమీలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆంగ్ల భాష విభాగం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ సెమినార్‌ నిర్వహించారన్నారు. అంతర్జాతీయ సెమినార్‌లో పాల్గొన్న హస్నత్‌ను పాఠశాల కరస్పాండెంట్‌ ప్రజ్ఞ గంగామోహన్‌, ఉపాధ్యాయులు అభినందించారు.