అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం- డాక్టర్ చెన్నమనేని వికాస్
21-09-2022 (జనం సాక్షి )
నగునూర్ కరీంనగర్ ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ప్రతిమ ఫౌండేషన్ సహకారం తో బుధవారం చందుర్తి మండలంలోని మల్యాల గ్రామ పెరిక సంఘం భవన్ ఆవరణలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని డాక్టర్ చెన్నమనేని వికాస్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ” అందరి భాగస్వామ్యంతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమౌతుందని, కరోనా వంటి విపత్కర సమయంలో
రైతులు చేసిన కృషి ఎనలేనిదని, దేశానికి అన్నం పెట్టిన రైతన్నలకు అండగా ప్రతిమ ఫౌండేషన్ నిలుస్తుందని,
దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆరోగ్యం మీ ముంగిట్లో అనే లక్ష్యంతో మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదలకు వైద్యాన్ని ఉచితంగా అందించే ఉద్దేశంతో ప్రతిమ సంచార ఆరోగ్య రథం ద్వార ఎక్స్ – రే, ఎలక్ట్రో కార్దియోగ్రామ్, కార్దియాక్ ప్రొఫైల్, మమ్మోగ్రఫీ, మినీ లాబొరేటరీ , మహిళలకు రొమ్ము క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించి 860 ఓ.పి , 363 మందికి పలు రకాల వైద్య పరీక్షలు ఆరోగ్య రథం ద్వారా అందించడం జరిగింది తదుపరి వైద్య పరీక్షల కోసం 63 మందిని ప్రతిమ ఆసుపత్రి కీ రిఫర్ చేయడం జరిగింది.
అనంతరం డాక్టర్ చెన్నమనేని వికాస్ గారు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిలకు, గ్రామ మహిళలకు, యువతులకు ఉచిత సానిటరీ నాప్కిన్లను మూడు నెలలకు సరిపడ అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మి నారాయణ , వార్డ్ సభ్యులు , స్వామి వివేకానంద సేవ సమితి సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘం సభ్యులు గ్రామ ప్రజలు,ప్రతిమ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.