అందరూ ఆదరిస్తున్నారు ఎమ్మెల్యే జాజాల సురేందర్
రామారెడ్డి డిసెంబర్ 12 ( జనం సాక్షి) :బిఆర్ఎస్ పార్టీని అందరూ ఆదరిస్తున్నారని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమం లో భాగంగా రామారెడ్డి మండలం గొల్లపల్లి ఇసనపల్లి గ్రామాల్లో సోమవా రం అభివృద్ధి పనులను చేపట్టారు. గొల్లపల్లి గ్రామంలో పది లక్షల నిధులతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి పది లక్షల నిధులతో డ్వాక్రా సంఘం భవణాన్ని నిర్మిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ పాల లావణ్య మల్లేష్ తెలిపారు. అనంతరం ఇసన్నపల్లి గ్రామములో యాబై ఆరు లక్షలతో సిసి రోడ్డు నిర్మాణం పనులు, పది లక్షల నిదులతో క్రీడా ప్రాంగణం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ , దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాలు ప్రవేశపెడుతూ దేశంలోనే గర్వించదగ్గ సీఎంగా కేసీఆర్ ఘనత చాటారని అన్నారు. అభివృద్ధిని చూడలేక ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దశరథ్ రెడ్డి, వైఎస్ ఎంపీపీ రవీందర్ రావు, గ్రామ సర్పంచులు కందూరు బాలమణీ, రామారెడ్డి సర్పంచ్ సంజీవ్, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు రాజ గౌడ్ , ఎంపీటీ సీలు ,వివిధ గ్రామాల సర్పంచ్లు ఉప సర్పంచ్లు, జిల్లా డైరెక్టర్ కాసర్ల రాజేందర్, సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు , వివిధ శాఖల అధికారులు ,జిల్లా నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు