అంధకారంలో ఆదిలాబాద్ డివిజన్

ఆదిలాబాద్ (జ‌నంసాక్షి) : ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆదిలాబాద్ డివిజన్ పూర్తిగా అంధకారంలో మునిగింది. బలంగా వీచిన గాలులకు పలు చోట్ల కరెంట్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా స్తంభించింది. మంగళవారం ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టారు. డివిజన్ పరిధిలో పూర్తిగా విద్యుత్ సరఫరా జరగాలంటే మరో రెండు రోజులు పడుతుందని విద్యుత్ ఎస్‌ఈ తెలిపారు.