అంబెడ్కర్ ఆలోచనలు ఆదర్శనీయం.

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు అత్యంత ఆదర్శనీయమని అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షులు మస్కే మాధవ్ అన్నారు. అంబెడ్కర్ 66వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో గల ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భీమ్ టైగర్ మండల అధ్యక్షులు బుద్ధే కిషన్ మాట్లాడుతూ విగ్రహాలలో అంబేద్కర్ ను బోధించడం కాదని పుస్తకాలలో అంబేద్కర్ ని చదవాలని అన్నారు. అంబేద్కర్ ఆలోచనా విధానంతో యువత ముందుకు సాగలని అన్నారు . అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువత ముందుకు వచ్చి దళితుల బహుజనుల అభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన కోరారు.దళిత సంఘాల పేరుతో దళితులను మోసం చేసే వారిని సమాజం నుండి తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో సర్పంచ్ సునిత రమేష్ జాధవ్ ,గేడం విజయ్, సిదార్థ్ ససానే, మాధవ్ ససానే, అడ్వకేట్ జోందళే అజయ్,కుశాల్, బబన్, ఎంఐఎం మండల అధ్యక్షుడు అర్షద్ ఖురోషి,దోమకొండ సుధాకర్, దమ్మనంద్, డీఎస్పీ మండల అధ్యక్షులు బడుగు రాజేశ్వర్  తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు