అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన పిల్లుట్ల రఘు

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్ :మండల పరిధిలోని వైకుంటపురం గ్రామంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌  విగ్రహాన్ని ఓజో పౌండేషన్ చైర్మన్  పిల్లుట్ల రఘు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని,బాల్యం నుండి వివక్షను ఎదుర్కొంటూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో అస్పృశ్యతను నివారిర్చడం నుండి మానవ సమాజాన్ని సమైక్యం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు.న్యాయవాదిగా,ఆర్థిక శాస్త్రవేత్తగా,రాజకీయ నేతగా,సంఘసంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహా నాయకుడు అంబేద్కర్‌ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఓజో ఫౌండేషన్ ఇన్చార్జి కుక్కల వెంకన్న,ప్రజాప్రతినిధులు,మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి,రాష్ట్ర అధ్యక్షులు చిక్కుడు గుండాలు,మాల మహానాడు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ,  సీనియర్‌ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు, జై భీమ్ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ,ఫౌండేషన్ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు