అక్రమంగా కలప కలిగివుంటే చర్యలు
కామారెడ్డి,జనవరి30(జనంసాక్షి): అడవులను నరికివేస్తే పీడీ యాక్టు కేసు నమోదు చేస్తామని కామారెడ్డి డీఎఫ్ఓ వసంత హెచ్చరించారు. అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, చెట్లను నరికివేయద్దవని సూచించారు. అడవులను నరికితే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని అన్నారు.స్మగ్లర్లు కలప కోసం అడవులను నరికితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా కలప అక్రమ రవాణాకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అడవులను నాశనం చేయవద్దని కోరారు. ఇంటి నిర్మాణానికి కలప అవసరం ఉంటే ప్రభుత్వ పర్మిట్ ఉన్న టింబర్ డిపోల్లో కొనుగోలు చేయాలని సూచించారు. రాష్ట్ర భూ భాగంలో 33 శాతం అడవులు ఉండాలని, కానీ తెలంగాణలో కేవలం 12 శాతం మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఇటీవల పలు ఇళ్లలో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకొన్నామని అన్నారు.