అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత…

55 లక్షల విలువ ….

డిసిపి వెంకటలక్ష్మి…

ఫోటో రైటప్: వివరాలు తెలియజేస్తున్న డీసీపీ వెంకట లక్ష్మి

నర్సంపేట: ఆగస్టు 9
(జనం సాక్షి )
నర్సంపేట పట్టణంలోని అక్రమంగా తరలిస్తున్న 55 లక్షల రూపాయల విలువ గల గంజాయిని వలపన్ని పట్టుకున్నట్లు
చేసిన వరంగల్ ఈస్ట్ జోన్
డిసిపి వెంకట లక్ష్మి తెలిపారు.
మంగళవారం నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో డిసిపి మాట్లాడుతూ మా పోలీస్ సిబ్బంది పాకాల సెంటర్లో వారాలు తనిఖీలు చేస్తుండగా బోలోరో వాహనం టీఎస్ 15 యు సి 8540 భద్రాచలం నుండి నారాయణ గడ్గే ఎక్కువ ధర విక్రయించడానికి వెళ్తున్నారని ఆమె పేర్కొన్నారు నిందితులను ఇద్దరిని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 278 పొట్లాలను 550 కిలోల గంజాయిని సుమారు 55 లక్షల 50 వేల రూపాయలు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో నర్సంపేట ఏసిపి ఏ సంపత్ రావు, సిఐ పులి రమేష్, ఎస్సై సురేష్, రవీందర్, ఎండి కలిముద్దీన్, సునీల్, కె రవి, పాల్గొన్నారు.