అక్రమంగా నకిలీ ధృవపత్రలతో భూ భదలాయింపు!!

తహసిల్దారునే బురిడీ కొట్టించిన మీసేవ నిర్వాహకుడు వీరేశ్ అలియాస్ అవనీశ్రీ..

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 5 మల్దకల్: ధరూరు మండలం ఓబులోనుపల్లి గ్రామానికి చెందిన కురువ పెద్ద సవరన్న వారి చిన్నమ్మ గోవిందమ్మకు బిజ్వారం శివారులోని 462/క సర్వే నెంబర్లో ఉన్న ఐదు ఎకరాల భూమిని భాగ పరిష్కారం చేసుకొని చెరి సగం ఖాస్తులో ఉన్నారు. కానీ రికార్డ్ మాత్రం సవరన్న గారి అవ్వ అయినా సవరమ్మ పేరు మీద కలదు. సవరమ్మ మరణానంతరం అట్టి మొత్తం భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ఆలోచనతో పెద్ద సవరన్న అదే గ్రామానికి చెందిన కురువ పరిషరాముడు, మరియు దాసరి పల్లి గ్రామానికి చెందిన మీసేవ నిర్వాహకుడు వీరేశ్ అలియాస్ అవని శ్రీ తో కలిసి చనిపోయిన వారి నాన్న నాగన్న ఆధార్ కార్డును సవరమ్మ రికార్డుకు లింకు చేసి ఆ తర్వాత తహసిల్దార్ చే జారీ చేయబడే ఫ్యామిలీ సర్టిఫికెట్ లేకుండా గానే వారసులు ఉన్న విషయాన్ని దాచి పెట్టి అట్టి మొత్తం భూమిని సవరన్న అమ్మ అయిన నరసమ్మ పేరు మీదికి మోసపూరితంగా విరాసత్ చేయడం జరిగింది. ఇటి విషయంలో గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పై తెలిపిన వ్యక్తులను అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు పంపగా గౌరవ జడ్జి వారిని జైలుకు పంపనైనదని మల్ధకల్ ఎస్సై శేఖర్ తెలిపారు.