అక్రమాలకు ఖంచు కోటగా మారిన కల్వకుర్తి
అక్రమార్కుల జేబులు నింపుతున్న రేషన్ బియ్యం
• అక్రమ రేషన్ దందా అని ప్రోత్సహిస్తున్న జిల్లా అధికారి మోహన్ బాబు వెంటనే సస్పెండ్ చేయాలి
• రేషన్ బియ్యం అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయలేకపోతున్న జిల్లా యంత్రాంగం
•అధికారుల సహకారంతో కల్వకుర్తి లో కోట్ల రూపాయల రేషన్ బియ్యం కుంభకోణం
•శ్రీనిధి రైస్ మిల్ యాజమాన్యంపై వెంటనే అటెంటూ మర్డర్ కేసు నమోదు చేయాలి
• స్థానిక నాయకులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది.
•అభివృద్ధికి ఆటంకంగా మారిన అవినీతి
• మాజీమంత్రి చిత్రంజందాస్ .
నాగర్ కర్నూలు జిల్లా బ్యూరో సెప్టెంబర్ 26 జనం సాక్షి: స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో అలమటించవద్దని సదుద్దేశంతో ఆపత్కాల సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సందర్భాన్ని బట్టి ఉచితంగా మరియు నిరుపేదల ఆర్థిక సోమతను దృష్టిలో ఉంచుకొని నామమాత్రపు ధరతో నిరుపేదలకు రేషన్ బియ్యం అందిస్తున్నాయి …. ఈ రేషన్ బియ్యం పేదవాడి కడుపు నింపుతుందో లేదో తెలియదు కానీ రైస్ మిల్లర్ ల జేబులు మాత్రం పూర్తిస్థాయిలో నింపుతుందని చెప్పవచ్చు . తాజాగా కల్వకుర్తి పట్టణంలో ఎల్లికల్ రోడ్డులో ఉన్న శ్రీనిధి రైస్ మిల్లులో గుట్టల కొద్దీ రేషన్ బియ్యం అటు అధికారులను ఇటు పట్టణవాసులను ఆశ్చర్యానికి గురిచేసాయి అని మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ అన్నారు సోమవారం కల్వకుర్తి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ మాఫియా నడుపుతున్న కొంతమంది మిల్లర్లు భౌతిక దాడులు దిగేందుకు సిద్ధపడుతున్నారు అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు అనేక సదుపాయాలు కల్పించినప్పటికీ అక్రమ ధనార్జనే ధ్యేయంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ భౌతికదారులకు సైతం దిగడం వెనకాడడం లేదని ఆరోపించారు ప్రభుత్వం ఇస్తున్న వడ్లను మరపట్టి బియ్యం గా చేసి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన మిల్లర్లు, ప్రభుత్వం ఇచ్చిన వడ్లను ఇతర రాష్ట్రాలకు అమ్ముకొని, రేషన్ షాపుల్లో నిరుపేదలకు ఇచ్చే బియ్యాన్ని 10 రూపాయలకు కొనుగోలు చేసి అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను మోసం చేస్తూ మిల్లర్లు కోట్లకు రూపాయాలు సంపాదించారని ఆరోపించారు. ఈ తతంగం అంతా స్థానిక నాయకులకు సంబంధిత జిల్లా అధికారులకు తెలిసే జరుగుతుందని ఇలా జరగడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడమే కాకుండా ప్రజలు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదవారికి ఉచితంగా ప్రతి ఒక్కరికి 10 కిలోల బియ్యాన్ని ఇస్తున్నారని దేశంలో ఎక్కడా కూడా కుటుంబంలోని ఒకరికి 10 కిలోల బియ్యం ఇవ్వట్లేదని అది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే అమలవుతుందని కొనియాడుతూ పేద ప్రజలకు చెందాల్సిన బియ్యం దురదృష్టవశత్తు రేషన్ మిల్లర్స్ కిలోకు పది రూపాయలు వేచించి పేద ప్రజలకు చెందాల్సిన బియ్యం పక్కదారి పట్టిస్తూ వేరే రాష్ట్రాలకు అమ్ముతూ కోట్ల రూపాయలు అర్జిస్తున్నారని వాపోయారు.
మూడు రోజుల కిందట శ్రీనిధి రైస్ మిల్లులో లారీ అసోసియేషన్ సభ్యులను అక్రమంగా లోపల వేసి తాళాలు వేయటం జరిగిందని వారిచ్చిన సమాచారం ప్రకారం ఆ మిల్లులో 1220 క్వింటాల రేషన్ బియ్యం పట్టుకోవడం దారుణం అని అన్నారు. వేరే రాష్ట్రాల లారీలను తీసుకువచ్చి రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు అమ్ముతూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని అన్నారు. సివిల్ సప్లై పై అధికారులు మాత్రం చూసి చూడనట్టు వదిలేయడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా రేషన్ మాఫియా పై అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే పై అధికారుల దృష్టికి తీసుకు పోవడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా తెలియజేస్తామని నాగర్ కర్నూల్ జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ మోహన్ బాబు పట్టు పడిన రోజు తూతుమాత్రంగా తనిఖీలు చేస్తూ మిల్లర్లతో చేతులు కలపడం ఎంతవరకు సమంజసం అని వారు వాపోయారు. పై అధికారులు స్పందించి రేషన్ మాఫియా పై తగు చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులతో పాటు సివిల్ కేసులు కూడా పెట్టి పేద ప్రజల బియ్యాన్ని పేదవారికి చెందాలని డిమాండ్ చేశారు. దీని యొక్క అక్రమ సంపాదన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని అన్నారు. పోలీసు వారు కూడా మిల్లర్స్ పై చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. కల్వకుర్తిలో ఎక్కడ చూసినా అవినీతి రాజమేలుతుందని ఇక్కడ స్థానికులు నాయకుల ద్వారా అధికారులు చేతులు కలిపి ప్రజా వ్యవస్థకే పెను ముప్పు కలుగుతుందని దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా కల్వకుర్తి తాలూకా సాధన కమిటీ ద్వారా అడ్డుకుంటామని రాబోయే రోజుల్లో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అవినీతిని అడ్డుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో తాలూకా అభివృద్ధి సాధన కమిటీ చైర్మన్ యాచారం వెంకటేశ్వర్లు గౌడ్ ఉపాధ్యక్షులు కల్వకుర్తి మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, తాలూకా అభివృద్ధి సాధన కమిటీ నాయకులు పెద్ద యాదవ్ తాలూకా అభివృద్ధి సాధన కమిటీ నాయకులు సదానందం గౌడ్ అభివృద్ధి కమిటీ కల్వకుర్తి మండల అధ్యక్షులు కురిమిద్దె మాజీ సర్పంచ్ పుట్ట శేకర్ , శశి కుమార్ గౌడ్, లక్ష్మయ్య గౌడ్ పాల్గొన్నారు