అక్రమ అరెస్టులు సరికావు’ ఖబడ్దార్ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పాలకులరా.
ఐఏఫ్టియూ జిల్లా అధ్యక్షులు గంజిపేట్ రాజు
గద్వాల రూరల్ జూలై 02 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు గత మూడు రోజుల నుంచి ఎలాంటి కారణం లేకుండా,ఎలాంటి పిలుపు లేకున్నా అర్ధరాత్రి వేళలో ఐఎఫ్టియూ జిల్లా అధ్యక్షులు గంజిపేట రాజు,పిడిఎస్యూ జిల్లా అధ్యక్షులు వంశి కుమార్,జిల్లా సహాయ కార్యదర్శి మురళీ, జిల్లా నాయకులు శివకుమార్ ఇండ్ల దగ్గరకు వచ్చి అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని అన్నారు..పోలీసు వారిని అడిగితే మాకు పై నుంచి ఆదేశాలు ఉన్నాయి,భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి అడ్డుకుంటారనే ఉద్దేశ్యంతో ముంద జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నాం అంటున్నారు,భాజపా సమావేశాలకు మా న్యూడెమోక్రసీ పార్టీకి, కార్మిక సంఘానికి, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడానికి సంబంధం ఏముందని అడుగుతున్నాం.ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకల్ని బంధిస్తారా అని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు.దేశంలో ప్రజాస్వామ్య విలువలను రోజురోజుకూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు దిగజారుస్తోందన్నారు.