అక్రమ సంబందం కేసులో ఒకరు దారుణ హత్య,

ఎట్టకేలకు కేసును ఛేదించిన పోలీసులు
మల్దకల్ అక్టోబర్10(జనం సాక్షి)మల్దకల్ మండలం అమరవాయి గ్రామానికి చెందిన సీమగొల్ల నడిపి నల్లన్న అలియాస్ మద్దెలబండ నడిపి నల్లన్న (54) ఈనెల 7వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు పసుల దొడ్డి గుడిసె లో దారుణంగా నరికి చంపివేశారు. మృతుని పెద్ద బార్య సీమగోళి ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.సిఐ చంద్రశేఖర్ దర్యాప్తు చేపట్టగా ఈ కేసుల్లో ముద్దాలైన అమరవాయి గ్రామానికి చెందినకావలి కిష్టన్న,కావలి రాజు
విచారణలో మృతుని బందువులు మృతునికి గల అక్రమ సంబందం పైన అనుమానం వ్యక్తం చేయగా మృతుని యొక్క స్వంత బామారదులు తప్పించుకుని తిరుగుతుండగా పట్టుకుని విచారించగ కావలి కిష్టన్న, భార్యతో బావనడిపి నల్లన్నకు అక్రమ సంబందం ఉన్నదని, స్వంత తమ్ముడు యగు రాజుకు వాళ్ల బావ చిన్న బిడ్డ చిన్న కూతురుని ఇచ్చి వివాహం చేసి తర్వాత సంసారనికి పంపనందున,ఈ ఇద్దరు అన్నదమ్ములు వారి బావ పై కక్ష్య పెంచుకుని పథకం ప్రకారం ఇంటిలో వున్న గొడ్డలిని తీసుకొని ఈనెల 7వ తేదీన అర్ధరాత్రి 12:30 గం’కు పశువుల దొడ్డి దగ్గరికి వెళ్ళి మృతుడు పడుకొని వుండగా కావలి కిష్టన్న రెండు కాళ్లు గట్టిగా పట్టుకొనగా అంతలో కావలి రాజు గొడ్డలితో మృతుడు ముఖoపై  పలుమార్లు నరికినాడు. తరువాత  కావలి కిష్టన్న కూడా అదే గొడ్డలితో పలుసార్లు మొఖం పైన నరికినారు. మృతుడు చనిపోయినాడని నిర్దారించుకోని గొడ్డలి తీసుకోని ఇంటికి వెళ్లి రక్తపు బట్టలు, గొడ్డలిని ఇంట్లో దాచి పెట్టినారు.తర్వాత మరుసటి రోజు ఉదయం అందరిలాగే వీరు కూడా ఎవరికి అనుమానం రాకూడదని మృతుడు శవం వెంబడే గద్వాల ఆసుపత్రి కి వెళ్ళి తిరిగి వచ్చి అంత్యక్రియలకు కూడా పాల్గొన్నారు.విచారణ అనంతరం ఇద్దరి నిందితులు నుండి రక్తపు బట్టలను గొడ్డలిని  స్వాధీనం చేసుకున్నారు.
జోగుళాoబ గద్వాల్ ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ ఆదేశాలతో జిల్లా అదనపు ఎస్పీబి.రాములు నాయక్, గద్వాల్ డి.ఎస్.పి ఎన్.సి హెచ్ రంగా స్వామి పర్యవేక్షణలో గద్వాలసి ఐ జి చంద్రశేఖర్, మల్దకల్ ఎస్సై శేఖర్,గద్వాల రూరల్ ఎస్సైఆనంద్ సిబ్బంది కలిసి సాoకేతిక మానవీయ కోణములో ఈ కేసును చేదించిఇద్దరి నిందితులను అరెస్టు చేయడం జరిగింది.అరెస్టు చేసిన ఇద్దరి నిందితులను రిమాండు నిమిత్తం సోమవారం గద్వాల గద్వాల కోర్ట్ లో హాజరు హాజరు పరిచినట్లు సిఐ చంద్రశేఖర్ ,ఎస్సై ఆర్ శేఖర్ తెలిపారు.