అఖిలపక్షంతో రాజ్‌నాథ్‌ భేటి

5
– నేడు కాశ్మీర్‌ పర్యటన

– హురియత్‌ నేతలను కూడా పిలవాలని పలువురి డిమాండ్‌

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి):కాశ్మీర్‌లో శాంతిస్థాపనకు అన్ని పార్టీలు ముందుకు వచ్చాయి. కేదం/-రం తసీఉకుంటున్న చర్యలకు మద్దతు తెలుపుతూనే పలు సూచనలు చేశాయి. కశ్మీర్‌ అంశంపై కేంద్ర ¬ంశాఖ మంత్రి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రాజ్‌నాథ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అన్ని పార్టీల నుంచి ఫ్లోర్‌ లీడర్లు హాజరయ్యారు. కశ్మీర్‌ అంశంపై చర్చించేందుకు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. అనంతరం రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ అందరి సూచనలు పరిస్తితులను గమనించి చర్యలు తీసుకుంటామని అన్నారు. రాజ్‌నాథ్‌ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పలు పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఆ పార్టీ లోక్‌సభా పక్ష నేత జితేందర్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశం అనంతరం రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ.. తాము కశ్మీర్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తిరిగి ఇదే ప్రతినిధుల బృందంతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. కాగా, కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌, మల్లికర్జున్‌ ఖర్గే మాట్లాడుతూ.. చర్చలకు ఎల్లప్పుడు తలుపులు తెరిచే ఉండాలన్నారు. కానీ చర్చలకు పంపాల్సిన బృందం ఎంపిక మాత్రం భారత ప్రభుత్వం చేతిలో ఉందని వ్యాఖ్యానించారు. అక్కడ ఎవరితో చర్చించాలన్నది గుర్తించాలన్నారు. కాశ్మీర్‌లో హురియత్‌ నేతలతో కూడా చర్చలు జరపాలని సిపిఎం నేత సీతారం ఏచూరి అన్నారు. చర్చలకు వస్తారా లేదా అన్నది వారి ఇష్టమన్నారు. అందరి కోరికా అక్కడా శాంతి స్థాపన అన్నారు. కశ్మీర్‌ లోయలో పెల్లెట్‌ గన్లకు ప్రత్యామ్నాయంగా కారం నింపిన గ్రెనేడ్లు (కారం బాంబులు), ‘పవా షెల్స్‌’ ఉపయోగించేందుకు కేంద్ర ¬ంమంత్రి రాజ్నాథ్‌ సింగ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కశ్మీర్‌లో ఆందోళనకారుల విూద పెల్లెట్ల ప్రయోగంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా రాజ్నాథ్‌ ఆధ్వర్యంలో అఖిలపక్ష బృందం ఆదివారం కశ్మీర్‌ పర్యటించనున్న విషయం తెలిసిందే. అఖిలపక్ష నేతలు ప్రజలు, సంస్థల్ని కలసి పరిస్థితిపై వివరాలు సేకరిస్తుంది. వేర్పాటువాద నేతల్ని కలిసేందుకు అఖిలపక్ష నేతలకు స్వేచ్ఛ ఉండడంతో వారితో చర్చించే అవకాశముంది. ఈ నేపథ్యంలో పవా షెల్స్‌ వాడకంపై రాజ్నాథ్‌ ఆమోదం తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. పెల్లెట్‌ గన్లకు బదులు.. నోనివామైడ్‌ అని పిలిచే పెలార్గానిక్‌ యాసిడ్‌ వానిలైల్‌ అమైడ్‌ (పవా)తో పాటు.. స్టన్‌ లాక్‌ షెల్స్‌, లాంగ్‌ రేంజ్‌ అకోస్టిక్‌ డివైజ్‌ (లార్డ్‌) వంటి ప్రాణాంతకం కాని మందుగుండును పెల్లెట్‌ గన్లకు ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చునని నిపుణుల కమిటీ కేంద్ర ¬ంశాఖకు సూచించిన విషయం విదితమే. కాగా కొత్తగా అభివృద్ధి చేసిన ఈ షెల్స్‌ పనితీరును ఇటీవలే ఢిల్లీలోని పరీక్షా కేంద్రంలో కమిటీ పరిశీలించింది.  మిరపకాయలో ఈ రసాయనిక పదార్థం లభ్యమవుతుంది. స్కొవిల్లే స్కేల్‌(మిరపఘాటును లెక్కించే కొలమానం)పై పవాది గరిష్ట స్థాయి. ఇది మనుషులను తీవ్రంగా చికాకు పెట్టడంతో పాటు గుంపుల్ని చెదరగొడుతుంది. ఘాటైన వాసన, కారంగా ఉండేందుకు ఆహార పదార్థాల్లో కూడా వాడతారు. ప్రయోగించగానే షెల్స్‌ పేలి శత్రువును తాత్కాలికంగా నిరోధిస్తుంది, అల్లరిమూకల్ని చెల్లాచెదురు చేస్తుంది. టియర్‌ గ్యాస్‌ షెల్‌, పెప్పర్‌ స్పే కంటే ప్రభావంతంగా పనిచేస్తుంది. ఈ షెల్స్‌పై ఏడాదిగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టాక్సికాలజీ రీసెర్చ్‌ (లక్నో)లో పరిశోధనలు నిర్వహించారు. కశ్మీర్‌ హింసాకాండ సమయంలోనే పూర్తి ఫలితం అందుబాటులోకి వచ్చింది. ఇకపోతే ఆందోళనకారులను నియంత్రించేందుకు పెల్లెట్‌ తుపాకులకు బదులుగా పావా షెల్స్‌ను ఉపయోగించేందుకు కేంద్ర ¬ంశాఖ ఆమోదించింది. ఈ మేరకు మిరప గుణాలున్న పావా షెల్స్‌ వినియోగానికి కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆమోదించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాజ్‌నాథ్‌ కశ్మీర్‌ పర్యటనకు ఒక్క రోజు ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు.కేంద్ర ¬ంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రసాద్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఈ సంఘం.. తమ నివేదికను ఇటీవల ¬ంశాఖకు సమర్పించింది.