అచ్చంపేటలో తీన్మార్ మల్లన్న 7200 సమావేశం
అచ్చంపేట ఆర్సీ ,అక్టోబర్13,జనంసాక్షి న్యూస్ : స్థానిక పట్టణంలో తీన్మార్ మల్లన్న 7200 టీం జిల్లా కన్వీనర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి నియోజకవర్గంలో ని వివిధ మండలాల గ్రామాల నుండి 7200 టీం కి సంబంధించిన వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ… తీన్మార్ మల్లన్న అవినీతి రహిత,విద్య,వైద్యం,నివాసం మౌలిక సదుపాయాలు అందించే కోసం 7200 కమిటీ పని చేస్తుందన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ అప్పుల కూపంగా మారిన పరిస్థితి నెలకొందని అన్నారు. తీన్మార్ మల్లన్న టీం లోని సభ్యులు ఎలాంటి స్వార్ధాలుగాని అవినీతికి పాల్పడిన నిర్ధాక్షణంగా కమిటీ నుండి తొలగించేస్తామని టీం సభ్యులు ప్రజల కోసం స్వచ్చందంగా సేవ చేయడానికి 7200 టీం లో పనిచేయాలని తెలిపారు. ఇదే క్రమంలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీన్మార్ మల్లన్న టీం దృష్టికి తీసుకువస్తే వారికి చట్టపరంగా న్యాయం చేసే విధంగా తమ వంతు సహకారాన్ని అందిస్తామన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన అధికారులు నాయకులు వ్యవస్థలో ప్రజల కోసము క్షేత్రస్థాయిలో సామాన్య పేద ప్రజలకు మౌలిక అంశాలైన విద్యా వైద్యం ఆరోగ్యం కోసం పోరాడే వారికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా గుండోజు స్వామి మాట్లాడుతూ.. పాలకులు రాజ్యాంగంలో ప్రతి ప్రభుత్వ రంగ వ్యవస్థలో ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా పనిచేయాలని ఎలాంటి పక్షపాతం లేకుండా భయోత్పాతాలను సృష్టించకుండా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని సూచించారు. త్వరలో అన్ని మండలాల గ్రామ కమిటీలతో కూలంకశంగా పలు అంశాలపై చర్చించి నూతన కమిటీలను ఎన్నుకునే దిశగా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న 7200 టీం నియోజకవర్గ ఇన్చార్జి గుండోజు స్వామి, అడ్వకేట్ మంతటి రాజేష్, శైలజ, మాధురి, శివ, పవన్ కుమార్, చందన్ కుమార్ ,కుంచెంవంశీ ,ఆనంద్ కుమార్, ఆడెపురాజేష్,జర్పాటి రాజు, తదితరులు పాల్గొన్నారు