అచ్ఛేదిన్‌ కోసం ఎదురు చూద్దం: చిదంబరం

 

న్యూఢిల్లీ,జూన్‌29(జనం సాక్షి): వాణిజ్య యుద్ధ భయాలు, పెరుగుతున్న చమురు ధరలతో గురువారం నాటి ట్రేడింగ్‌లో దేశీయ కరెన్సీ రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనమైన దశలో మాజీ ఆర్థికమంత్రి చిదంబరం/- బిజెపి ప్రభుత్వపై మరోమారు చురకలు అంటించారు. భాజపా ‘అచ్ఛేదిన్‌ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంటానంటూ ఎద్దేవా చేశారు.’డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.40కి సమానమయ్యేంత దాకా భాజపా అచ్ఛేదిన్‌ కోసం ఎదురుచూస్తూనే ఉంటా’ అని చిదంబరం ట్వీట్‌ చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ‘అచ్ఛేదిన్‌’ అనే నినాదాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్కువగా ఉపయోగించారు. ఇప్పుడు అదే నినాదంతో చిదంబరం విమర్శలు గుప్పించారు. గురువారం నాటి ట్రేడింగ్‌లో రూపాయి విలువ భారీగా పతనమైంది. ఉదయం రూ. 68.89 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించిన రూపాయి.. ఆ తర్వాత రూ. 69.09 స్థాయికి దిగివచ్చింది. ఇది జీవన కాల కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. అనంతరం కాస్త పుంజుకున్నప్పటికీ చివరకు 18 పైసలు నష్టంతో 68.79 వద్ద ముగిసింది.