అట్టడుగువర్గాలపై కాంగ్రెస్‌ నిర్లక్ష్యం

` మహారాష్ట్రలో ప్రధాని మోదీ విమర్శ
నాగ్‌పూర్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ పార్టీ బంజారాలతో పాటు అట్టడుగు వర్గాలను, రైతులను నిర్లక్ష్యం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. మహారాష్ట్రలోని విదర్భలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ బంజారాలతో పాటు అట్టడుగు వర్గాలను, రైతులను నిర్లక్ష్యం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. మహారాష్ట్రలోని విదర్భలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ప్రతి ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామంటూ బూటకపు హావిూలు ఇవ్వడం కాంగ్రెస్‌ పార్టీకి అలవాటేనని ప్రధాని మోదీ ఆరోపించారు. తెలంగాణలో కూడా రైతుల రుణ మాఫీ చేస్తామని హావిూ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు.అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా రైతుల రుణాలు మాఫీ కాలేదని అన్నారు. దీంతో రైతులు ఇప్పుడు రుణ మాఫీ కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని చెప్పారు. రైతులను కాంగ్రెస్‌ గౌరవించదని, వారి అవసరాలను పట్టించుకోదని అన్నారు. డ్రగ్స్‌ వ్యాపారంలో కాంగ్రెస్‌కు సంబంధాలున్నాయని, ఢల్లీిలో దొరికిన డ్రగ్స్‌ కేసులో కాంగ్రెస్‌ నేత పాత్ర ఉందని ఆరోపించారు.