అజాద్ హింద్ పౌజ్ నేతాజీకీ మరణం లేదు

 

-అఖండ భార‌త్‌కు స్వాతంత్య్రం తెచ్చింది నేతాజీనే…
-ఘ‌నంగా ఆజాద్ హింద్ సర్కార్ 80వ వ్యవస్థాపక దినోత్సవాలు
– 2కే ర‌న్ పాల్గొన్న వేలాధిమంది..
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి

క‌రీంన‌గ‌ర్ టౌన్ అక్టోబర్ 13(జనం సాక్షి)

ఆంగ్లేయుల గుండెల్లో గుబులు రేపిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని, ఆజాద్ హింద్ సర్కార్ 80వ వ్యవస్థాపక దినోత్సవాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి డిమాండ్ చేశారు. ఆజాద్ హింద్ సర్కార్ 80వ వ్యవస్థాపక దినోత్సవాల సంద‌ర్బంగా క‌రీంన‌గ‌ర్ లో అంబేద్క‌ర్ స్టేడియం నుండి తెలంగాణ చౌక్ వ‌ర‌కు ముందుకు సాగిన 2కె ర‌న్ ర్యాలీలో వేలాది మంది యువ‌కులు, మ‌హిళ‌లు, మేదావులు, నేతాజీ అభిమాన‌నులు, పాల్గొన్నారు. స్వ‌చ్చంద సంస్థ‌లు, ప్ర‌జాసంఘాల‌కు క‌లిసి వ‌చ్చారు. ఆజాద్ హింద్ సర్కార్ 80వ వ్యవస్థాపక దినోత్సవాల సంద‌ర్బంగా క‌రీంన‌గ‌ర్‌లో పార్వ‌ర్డ్ బ్లాక్ జండాలు, వాల్ రైటింగ్ ప్ర‌ద‌ర్శించారు. ఎఐఎఫ్‌బి జండాల‌తో క‌రీంన‌గ‌ర్ ఎరుపెక్కింది. అనంత‌రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి మాట్లాడుతూ జననమే తప్ప మరణం లేని మ‌హోన్న‌త వ్య‌క్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని పేర్కొన్నారు.ఆజాద్ హింద్ సర్కార్ యొక్క చరిత్ర మన స్వాతంత్య్ర చరిత్రలో అత్యంత కీలకమైన అంశమ‌ని పేర్కొన్నారు. ఆజాద్ హింద్ సర్కార్‌ను నేతాజీ సుభాష్ చంద్రబోస్ 21 అక్టోబరు 1943న-రెండో ప్రపంచయుద్ధం లో జరిగిన అంతర్జాతీయ అంశాల నేపథ్యంలో సింగపూర్‌లో స్థాపించి భార‌తీయుల‌కు అండ‌గా నిలిచార‌న్నారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ పునర్వ్యవస్థీకరణ తర్వాత, తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా నేతాజీ ఆంగ్లో-అమెరికన్ దళాలకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించ‌గా, అతని ప్రభుత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా 9 దేశాలు గుర్తించాయ‌ని వివ‌రించారు. . నేషనల్ బ్యాంక్, కరెన్సీ, ప్లానింగ్ కమిటీ, మహిళా వ్యవహారాలతో సహా వివిధ శాఖల మంత్రులు మొదలైన ప్రభుత్వానికి అవసరమైన అన్ని సామాగ్రిని ఆయన తయారు చేశారు. ఆజాద్ హింద్ సర్కార్ స్థాపన మన స్వాతంత్ర పోరాటంలో ఒక మలుపు తిరిగిందన్నారు. 2018లో మోదీ ప్రభుత్వం దక్షిణ అండమాన్‌లోని చిన్న ద్వీపమైన రాస్‌ దీవిని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ దీవిగా మార్చింది. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం కేవలం 10 మంది మాత్రమే ఉన్న చిన్న ద్వీపం. అందుకే ఇది నేతాజీని అవమానించడమే అని ఆవేశ‌న వ్య‌క్తం చేశారు. అపహాస్యం చేసే బదులు నేతాజీ ప్రకటించిన “షహీద్ & స్వరాజ్” గా దీవుల పేర్లను ప్రభుత్వం మార్చాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఇండియన్ నేషనల్ ఆర్మీ గురించి భావితరాలకు అవగాహన క‌ల్పించేందుకు క‌రీంన‌గ‌ర్‌లో నిర్వ‌హించిన 2కె ర‌న్ కార్య‌క్ర‌మంలో వేలాది మంది ముందుకు పాల్గొన్నార‌ని అన్నారు. 30 డిసెంబర్, 1943న, ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి హోదాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తొలిసారిగా అండమాన్, నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్ జింఖానా మైదానంలో త్రివర్ణ జాతీయ జెండాను ఎగురవేశారన్నారు. అండమాన్, నికోబార్ దీవుల పేరును షహీద్ ,స్వరాజ్ దీవులుగా మార్చారని ఆయ‌న తెలిపారు. ఆగస్ట్ 15, 1947 తర్వాత అండమాన్ నికోబార్ దీవులుగా పిలవడం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని కేంద్ర ప్రభుత్వం అవమానించడమే అవుతుందని పేర్కొన్నారు. 2018 డిసెంబర్ 29వ తేదీన, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొదటి జెండా ఎగురవేసిన 75వ వార్షికోత్సవ సంస్మరణలో పాల్గొనడానికి భారత ప్రధాని మోడీ వెళ్లారు. అండమాన్, నికోబార్ దీవులలోని 300 (మూడు వందల) దీవులలో 3 (మూడు) దీవులను మాత్రమే మార్చాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించడం వెనుక రాజకీయ జిమ్మిక్కు ఉంద‌ని అన్నారు. నేతాజీ విగ్రహం మోడీ పెట్టి గౌరవించడం అభినందనీయమ‌ని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ. రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి పేర్కొన్నారు. జాతీయోద్యమంలో భారతీయ జనతా పార్టీ, సంఘ్ పరివార్‌ల పాత్ర లేదన్నారు. మతోన్మాదమే సామ్రాజ్యవాదానికి ఇష్టమైన ఆయుధమ‌ని, కొనియాడారు. ఈ కార్య్ర‌క‌మంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయ‌కులు గ‌వ్వ వంశీధ‌ర్ రెడ్డి, జిల్లా మ‌హిళ కో క‌న్విన‌ర్ – ఐల ప్ర‌స‌న్న‌, ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రి – పులిమాటి సంతోష్ కుమార్‌, జిల్లా నాయ‌కులు – పెద్దెల్లి శేఖ‌ర్‌,కురివెళ్లి శేఖ‌ర్, ఉప్పుల రాజు ,కె.బాస్క‌ర్ త‌దిత‌రులు పాల్గోన్నారు. బార్ అసోసియోష‌న్ ప్రేసిడెంట్ ఎర్రం రాజిరెడ్డి , ఎక్స్ స‌ర్విస్ మాన్ కరీంన‌గ‌ర్ అసోసియోష‌న్ ప్రెసిడెంట్ బి. మోహ‌న్ , మంద‌ల మ‌హింద‌ర్ రెడ్డినీలం ల‌క్ష్మ‌ణ్‌,ఎక్స్ స‌ర్విస్ మాన్ మ‌హిపాల్ రెడ్డి , ఎక్స్ స‌ర్విస్ మాన్ బిస్మిల్లా ఖాన్, విన‌ద్ రెడ్డి, సాన్వి మునిద‌ర్ , తోట శ్రీధర్‌ల‌తో పాటు డిఫేన్స్ అకాడ‌మి, డిల్లి డిఫేన్స్ అకాడ‌మి, సాన్వి అకాడ‌మి, డ్రీమ్స్ అకాడ‌మి, ధ్రోణ‌ఛార్యా అకాడ‌మి, శాత‌వాహాణ అకాడ‌మి, తేజ అకాడ‌మి, కేఎన్‌ ఆర్ అకాడ‌మిల‌కు చెందిన స్కూడెంట్స్ పాల్గొన్నారు.