అజార్‌పై జీవితకాల నిషేధం ఎత్తివేయండి
హైదరాబాద్, నవంబర్ 8 (జనంసాక్షి) : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మురదా బాద్ ఎంపీ మహమ్మద్ అజా రుద్దీన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో వచ్చిన ఆరోపణలతో అజార్‌పై బీసీసీఐ పన్నెండేళ్ల కిందట విధించిన జీవిత కాల నిషేధాన్ని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం గురువారం రద్దు చేసింది. నిషేధాన్ని సమర్థిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం తప్పుబ ట్టింది. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో అజారుద్దీన్ మ్యాచ్‌ఫిక్సింగ్ పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన బీసీసీఐ.. అజార్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని నిర్ధారించింది. 2000 డిసెంబర్ 5న ఆయనపై జీవిత కాల నిషేధం విధించింది. బీసీసీఐ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అజార్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. బీసీసీఐది ఏకపక్ష నిర్ణయమని, ఎలాంటి ఆధారాల్లేకుండానే నిషేధం విధించారని వాదించారు. తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఆయన విజ్ఞప్తిని సివిల్ కోర్టు తోసిపుచ్చింది. నిషేధాన్ని సమర్థిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. కిందికోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ అజారుద్దీన్ హైకోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ఆధారాల్లేకుండా బీసీసీఐ నిషేధం విధించడం, దాన్ని కింది కోర్టు సమర్థించడాన్ని తప్పుబడుతూ తనపై నిషేధాన్ని ఎత్తివేయాలని వాదించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఆధారాల్లేకుండా ఏకపక్షంగా నిషేధం విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే, బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థించిన కింది కోర్టును కూడా ధర్మాసనం తప్పుబట్టింది. అజారుద్దీన్‌పై జీవిత కాల నిషేధాన్నిరద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. హైదరాబాద్‌కు చెందిన అజారుద్దీన్ భారత క్రికెట్‌కు 15 ఏళ్ల పాటు నిరంతర సేవలందించారు. క్రికెట్‌లో ఎన్నో ఘనతలు సాధించారు. విజయవంతమైన భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందారు. 99 టెస్టులు ఆడిన అజార్ 6,125 రన్లు చేశారు. 334 అంతర్జాతీయ వన్డేల్లో 9,378 పరుగులు చేశారు. ఆయన హయాంలోనే హీరో ండా కప్ సహా పలు చారిత్రాత్మక విజయాలను భారత జట్టు నమోదు చేసింది.