అడవి సంరక్షణ నియమాలు 2022 ను వెనక్కి తీసుకోవాలి

అఖిల భారత రైతు కూలీ సంఘం(AIKMS) రాష్ట్ర అధ్యక్షులు వి కోటేశ్వరరావు

టేకులపల్లి, సెప్టెంబర్ 25( జనం సాక్షి ): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆదివాసుల అస్తిత్వాన్ని ధ్వంసం చేసే విధంగా తీసుకువచ్చిన నూతన అటవీ విధాన ముసాయిదా 2002ను వెనక్కి తీసుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కోటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం టేకులపల్లి మండల కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ సమావేశం ముక్తి సత్యం అధ్యక్షతన జరిగింది. ఈ ఈ సమావేశానికి కామ్రేడ్ వి కోటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలోని అటవీ ప్రాంతాలు ఉన్నటువంటి 14 రాష్ట్రాల్లో, 10 కోట్ల మంది ఆదివాసీల జీవితాలను చిన్నాభిన్నం చేసే విధంగా, పరోక్షంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని 40 కోట్ల మంది ప్రజల పై తీవ్ర ప్రభావం చూపుతున్న నూతన అటవీ విధాన ముసాయిదా 2002 ను తీసుకురావడమంటే ఏజెన్సీలోని ఆదివాసులను అడవుల నుండి గెంటి వేసే చర్యలు తప్ప మరొకటి కాదని విమర్శించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను నిట్ట నిలువునా కార్పొరేట్ పెట్టుబడిదారులకు, బహుళ జాతి సంస్థలకు అమ్మి వేస్తూ, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకురావడమే కాక, విద్యుత్తు సవరణ బిల్లు తీసుకువచ్చి రైతాంగం పై , మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపటానికి ప్రయత్నిస్తుందని అన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలపై భారత రైతాంగం తిరుగుబాటు చేయడంతో వెనక్కి తగ్గిన కేంద్రం, వివిధ రూపాల్లో కార్పొరేటు శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తూ, మరోసారి అటవీ సంపదను దోచుకుపోవడానికి ఆదివాసీలపై కుట్రపూరితంగా అటవీ విధాన ముసాయిదా 2002 పేరుతో భారతదేశంలోని అడవులను అటవీ సంపదను కార్పొరేట్ పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు ప�