అడుక్కునే స్థితిలో లేం: గువ్వల
హైదరాబాద్: తాము చంద్రబాబును అడుక్కునే స్థితిలో లేమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. తెలంగాణకు రావలసిన విద్యుత్ వాటాను పోరాడి సాధించుకుంటాం తప్పితే అడుక్కోబోమని అన్నారు. తెలంగాణలో ఉనికి కోసమే చంద్రబాబుతో టీటీడీపీ నాయకులు యాత్రలు చేయిస్తున్నారని ఆయన అన్నారు.