అడుగు అడుగున అవమానాలు…
రాష్ట్రం లో సర్పంచ్ లకు ప్రాధాన్యత లేదు
-రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంతో గ్రామానికి సర్పంచ్ అంత
– సమావేశంలో మాట్లాడుతున్న ఎం.పి.ఉత్తమ్ హుజూర్ నగర్, సెప్టెంబర్ 19 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్రం లో గ్రామ సర్పంచ్ లు నిధులు విధులు లేక అడుగు అడుగునా అవమానాలు భరిస్తూ బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నల్గొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో సూర్య పేట జిల్లా లో ఉన్న కాంగ్రెస్ సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు తో తెరాస ప్రభుత్వం నుండి వారు ఎదురుకుంటున్న సమస్యలు తెలుసుకునేందుకు ముఖ్య కార్యకర్తల తో సమావేశం ఏర్పాటు చేశారన్నారు. ఈ సందర్భంగా ఎం.పిఉత్తమ్ సర్పంచ్ లను, ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు సరైన నిధులు విధులు లేక అడుగు అడుగున అవమానాలు భరిస్తూ బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.
తెరాస ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా చేస్తుందన్నారు. పల్లె ప్రగతి లో పనుల చేసిన నెలల తరబడి బిల్లులు రాక లక్షలాది రూపాయల పెండింగ్ బిల్లులతో సర్పంచులు ఆర్థికఇబ్బందులకు గురి అవుతున్నారని, తెచ్చిన డబ్బులకు వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడు తున్నారనీ ఆరోపించారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే నియోజక వర్గం లో ఉన్న సర్పంచ్ ల తీర్మానం లేకుండానే ఎల్ ఈ డి లైట్లు, ట్రాక్టర్లు, చివరికి బ్లీచింగ్ ఫౌడర్ కొనుగోలు చేసి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కొంత మంది మండల అభివృద్ధి అధికారులు బ్లీచింగ్ ఫౌడర్ లు కొనుగోలు చేసి గ్రామ పంచాయతీలకు సరఫరా చేస్తున్నారని వారు గ్రామ పంచాయతీకి సరఫరా చేసే అవసరం ఏమిటి అని ప్రశ్నించారు. జిల్లా పరిషత్ సమావేశంలో క్షేత్ర స్థాయిలో సర్పంచ్ లను అడిగితే సమస్యల చిట్ట చెబుతున్నారని అన్నారు. సర్పంచ్ లు కు రావాల్సిన పల్లె ప్రగతి బిల్లులు జడ్పీ సమావేశం లో తాను ప్రశ్నించడం వలనే కొంత నిధులు మంజూరు అయ్యాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నడి గూడెం మండల కరివిరాలలో ఎమ్మెల్యే బోల్లం మల్లయ్య యాదవ్, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డిలు కలిసి కాంగ్రెస్ మహిళ సర్పంచ్ పై తప్పుడు ఆరోపణలు చేసి సస్పెండ్ చేశారనీ దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నా అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్న అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని గ్రామాల్లో 12 గంటలు కూడా కరెంటు రావడం లేదన్నారు. కొన్ని చోట్ల గ్రామాల్లో వైకుంఠ దామాలు నిర్మించారని వాటికి బిల్లులు చెల్లించక సర్పంచులు ఇబ్బందులుపడుతున్నారన్నారు. ఎస్ డి ఎఫ్ నిధులతో చేపట్టిన పనులకు ఎంబీలు చేసి నెలలు గడిచిన బిల్లులు రాలేదని లక్షల రూపాయలు పెండింగ్ లో ఉండటంతో అప్పులు పాలవుతున్నారన్నారు. హుజూర్ నగర్ మండలం సర్పంచ్ లకు ఏ కష్టం వచ్చిన సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఉత్తమన్న మీ వెంటే ఉంటా అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లిఖార్జున రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశముఖ్, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, యం.పి.పి గోపాల్, జెడ్పీటీసీ మోతీలాల్, మంజునాయక్, కోనతం చిన్న వెంకటరెడ్డి, అంజన్ రెడ్డి, గోవిందా రెడ్డి, కొట్టే సైదేశ్వ ర రావు, బచ్చల కూరి బాబు, కుక్కడపు మహేష్, ముక్కంటి, కృష్ణ,రాము, జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.