అడ్డుపుల్ల రాజకీయాలు

అడ్డుపుల్ల రాజకీయాలున్యూఢిల్లీ, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) :ఢిల్లీలో సీఎం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణపై అఖిలప క్షాన్ని అడ్డుకునేందుకు హస్తలో రాజకీయాలు నడుపు తున్నాడు. ఆదివారం సోనియాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకని శనివారం మధ్యాహ్నం కిరణ్‌ హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీని ఆమె నివాసం టెన్‌ జన్‌పద్‌లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణతో పాటు రాష్ట్ర వ్యవహారాలపై చర్చించినట్లు సమాచారం. అంతకుముందు కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరం, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌తో విడివిడిగా భేటీ అయ్యారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తిరుపతి వేదికగా ప్రపంచ

తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న దృష్ట్యా తెలంగాణపై అఖిలపక్ష సమావేశాన్ని వాయిదా వేయాలని కిరణ్‌ పార్టీ పెద్దలను కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హోం మంత్రి షిండే ఇటీవల అఖిలపక్షంపై ప్రకటన చేయగా సీఎం ఆయనతో 30 నిమిషాలకు పైగా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన పెద్దలందరి వద్ద ఒకే అంశం ప్రస్తావించినట్లు తెలిసింది. ఎలాగైనా తెలంగాణపై నిర్వహించే అఖిలపక్షాన్ని వాయిదా వేయించడమే పనిగా పావులు కదిపినట్లు సమాచారం. ఇందుకు ఢిల్లీలోనే ఉన్న కొందరు ఎంపీలతో కూడా ఇతర పార్టీ పెద్దలకు చెప్పిచ్చినట్లుగా తెలిసింది. తెలంగాణపై అఖిలపక్షం నిర్వహిస్తే అది తెలుగు మహాసభల నిర్వహణకు అడ్డంకిగా మారుతుందని, ప్రపంచ దేశాల ముందు తలెత్తుకునే అవకాశం ఉండబోదనే విధంగా కూడా ఒత్తిడి తెచ్చినట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి ప్రయత్నాలపై ఆ పార్టీ తెలంగాణ ప్రాంత నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందు నిర్ణయించినట్లుగానే ఈనెల 28న అఖిల పక్షం నిర్వహించాలని వారు పట్టుబడుతున్నారు.