అణగారిన వర్గాల అభ్యుదయ వాది బాబు జగ్జీవన్ రామ్….
వనపర్తి జులై 6 (జనం సాక్షి) వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ 36 వర్ధంతిని టీజేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రజా వాగ్గేయకారుడు రాజా రామ్ ప్రకాష్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర సమరయోధుడు భారత దేశ ఉప ప్రధానమంత్రి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిమ్నకులాల వర్గాల అభ్యుదయానికి కృషి చేసిన భారత అమూల్య రత్నం భారత తొలి దళిత సామాజిక న్యాయం కోసం పని చేసిన యోధుడు దేశానికి విశేష సేవలందించిన సమతా వాది కులరహిత,మత రహిత సమాజం కోసం పాటుపడిన నేత,నవ భారత క్రాంతి దర్శి, సేవాతత్పరుడు, గాంధేయ వాది ,అజాతశత్రువు బాబు జగ్జీవన్ రామ్ విద్యార్థులు ఆయన స్ఫూర్తితో ఎదగాలని సమాజసేవకులు గా మారాలని కోరారు. స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ తో కలిసి పనిచేసి బెనారస్ విశ్వ విద్యాలయంలో ఉన్నత చదువులు చదివి నిమ్నకులాల హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగించి 27 సం”ల పిన్న వయసు లోనే బీహార్ రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై,మంత్రిగా పనిచేసి ఆ రాష్ట్రంలోని ససారం నియోజకవర్గం నుండి తొమ్మిది సార్లు భారత పార్లమెంటుకు ఎన్నికై ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గొప్ప వ్యక్తిగా వెలుగొందిన మహోన్నతుడు. జగ్జీవన్రామ్ 50 ఏళ్ల పాటు భారత రాజకీయాల్లో అనేక పదవులను చేపట్టి ఆ పదవులకే వన్నెతెచ్చిన జగ్జీవన్రామ్ కేంద్ర మంత్రి వర్గంలో కార్మిక శాఖ వ్యవసాయ శాఖ మంత్రి రైల్వే శాఖ రక్షణశాఖ మొదలగు శాఖలకు ప్రాతినిథ్యం వహిస్తూ ఈ ప్రపంచంలో భారత దేశ గౌరవాన్ని పెంపొందింప జేసి న జ్ఞానపిపాసి జగ్జీవన్ రామ్ రైతుల హక్కుల కోసం ఆనాడే కేతిఆర్ మజ్దూర్ సభ ను స్థాపించాడు,స్వామినాథన్ వంటి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తల నివేదికను అమలు పరచడానికి పార్లమెంటులో చట్టం చేసినా గొప్ప యోధుడు దార్శనికుడు ఆహార సమస్యలు తీర్చేందుకు ఆయన సూచించిన శాస్త్రీయ పద్ధతులు గొప్ప స్ఫూర్తి కుల నిర్మూలన కోసం జరిగిన సామాజిక సంస్కరణోద్యమం కోసం పాటుపడిన కోసం నిరంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తో కలిసి పనిచేసి ఆర్టికల్ 17 ప్రకారంగా నేటికి రిజర్వేషన్ల వ్యవస్థను కొనసాగడానికి కారణభూతమైన అటువంటి వ్యక్తి, ఆలిండియా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగాడు ఇందిరా గాంధీతో విభేదాల కారణంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ జగ్జీవన్రామ్ పేరుతో పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల లో పాల్గొన్నాడు మురార్జీ దేశాయ్ మంత్రిత్వంలో తొలుత మంత్రిగా తర్వాత ఉప ప్రధానమంత్రిగా పనిచేశాడు ప్రధాన మంత్రి కావడానికి అన్ని అర్హతలు ఉన్న అగ్రకుల పార్టీలు అగ్రకుల వ్యక్తుల మూలంగా ప్రధానమంత్రి పదవికి దూరం అయిన ఆయన తన జాతి కోసం దేశ అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేసిన పోరాట పటిమ గల గొప్ప యోధుడు జగ్జీవన్రామ్.ఆయన చేసిన సేవలను గుర్తించుకునీ భారత ప్రభుత్వం ఇప్పటికైనా భారతరత్న ప్రకటించాలని ఈ సందర్భంగా ప్రజావాగ్గేయకారుడు రాజా రామ్ ప్రకాష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో కవిపండితుడు బూరోజు గిరి రాజా చారి,కవి శ్రేష్టుడు వ్యాఖ్యాత డాక్టర్ నాయకంటి నరసింహ శర్మ,మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకుడు తగవులవెంకటస్వామి దళిత సంఘాల ప్రతినిధి కొమ్ము బాలస్వామి, శాలివాహన సంఘం జిల్లా నాయకులు కోనింటి వెంకటేశ్వర్లు గుణ గంటి వెంకటయ్య యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు డి కృష్ణయ్య,జిల్లా నాయకుడు వెంకటేష్ మొదలగు వారు పాల్గొన్నారు.