అతి ప్రమాదకరంగా మారిన తొర్రూరు నుండి వలిగొండ ప్రధాన రహదారి అడుగడుగునా గుంతలే పట్టించుకోని ఆర్ అండ్ బి రోడ్డు అధికారులు

 

పెద్దవంగర అక్టోబర్ 13(జనం సాక్షి )పెద్దవంగర మండల బావోజితండా గ్రామం కిష్టు తండా ముందు మరియు చిన్నవంగర, బీసీ తండా, టేకుల మైసమ్మ , దగ్గర పలుచోట్ల రోడ్డు తొర్రూర్ నుంచి వలిగొండ ప్రధాన రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది ఎన్నోసార్లు ప్రయాణికులకు బలమైన గాయాలు అయ్యాయి. కానీ అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ స్థానిక మండల ఎస్సై రియాజ్ పాషా మాత్రం స్పందించి పలుమార్లు తన సొంత ఖర్చులను వెచ్చించి మట్టి పోయించారు అయినా ఫలితం లేకుండా పోయింది.అకాల వర్షాల కారణంగా మరియు వాహనాలు రద్దీగా తిరుగుతుండడంతో మట్టి కాస్త కొట్టుకుపోవడంతో అత్యంత ప్రమాదకరంగా ఉండడంతో అక్కడ ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. అయినను ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. కిష్టు తండా ఆదివాసులు అక్కడ జరుగుతున్న ప్రమాదాలకు చెలించిపోయి, వెంటనే అధికారులు స్పందించాలని కోరారు, అదేవిధంగా వాహనదారులు కూడా రోడ్డుపైన వెళుతున్నందుకు వాహనానికి రోడ్డు టాక్స్ , చలాన్లు కడుతున్న కూడా రోడ్లు ఈ విధంగా ఉండడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరియు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మండలం పత్రికా విలేకరులు స్పందించి ఎస్సై రియాజ్ పాషా ను వివరాలు కోరగా జరుగుతున్న ప్రమాదాలకు చూసి ఉండలేక చలించిపోయి నా సొంత ఖర్చులతో శ్రద్ధ చూపించి, దగ్గరుండి రోడ్డుని సరి చేశాను అని, ప్రమాదం జరిగే చోట హెచ్చరిక బోర్డులను కూడా పెట్టామని తెలిపారు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది అకాల వర్షాల కారణంగా రద్దీగా ఉన్న వాహనాల తాకిడికి మట్టి నిలవకుండా పోయిందని. మరియు ఆర్ అండ్ బి.ఎ ఈ లెటర్ కూడా పెట్టానని అయినా స్పందన లేదని తెలియజేశారు.
ప్రజలు కూడా విచారణ వ్యక్తం చేస్తూ ఈ రోడ్డు డబల్ రోడ్డుగా రూపాంతరం చెందే విషయాన్ని తెలియజేస్తూ. రోడ్డు తయారవ్వడానికి పట్టె కాలానికి ముందు, అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోని కనీసం మైనర్ రిపేర్లు అయినా చేయించాలని, అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఈ రోడ్డుని తాత్కాలికంగా రిపేర్లు చేయించి వాహనదారులకు ప్రజలకు ప్రయాణం సజావుగా సాగే విధంగా అధికారులు ప్రజాప్రతిని స్పందించాలని కోరుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమానుకూడదని హెచ్చరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.