రక్తదానం చేసిన పానుగంటి ప్రవీణ్ కుమార్

 

 

జనగామ (జనం సాక్షి)జూలై16: జనగామ పట్టణానికి చెందిన యమునా మాతృమూర్తికి అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం ఉండడంతో వెంటనే స్పందించిన పానుగంటి ప్రవీణ్ కుమార్ స్వయంగా జనగామ జిల్లా ఆసుపత్రికి వెళ్లి దానం చేసి ప్రాణదాతగా నిలిచారు ,జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్ ముఖ్య సలహాదారులు వంగ భీమ్ రాజు మాట్లాడుతూ జనగామ పట్టణం హైదరాబాద్ వరంగల్ లో అత్యవసర సమయంలో రక్తం దానం చేసి ప్రాణదాతగా నిలిచిన పానుగంటి ప్రవీణ్ కుమార్ ఇప్పటి వరకు 40 సార్లు స్వయంగా వెళ్లి రక్తదానం చేసి గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు అని జనగామ అమ్మ పౌండేషన్ టీం తరఫున అభినందిస్తూ ఇప్పుడున్న యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.రక్తదానం చేద్దాం ప్రాణదాతలు నిలుద్దాం, సమాజంలో కష్టాల్లో ఉన్న ప్రజలకు తోచినంత సహాయం చేసి అండగా నిలబడి మానవత్వాన్ని చాటుదాం.