అత్యాచారాలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలి: ఎస్పీ బాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఇలాంటి ఘటనల విషయంలో ప్రభుత్వం, సమాజం బాధ్యతతో వ్యవహరించాలన్నారు. తిరుపతి పట్టణంలో ఏర్పాటుచేసిన మాస్టర్‌మైండ్స్‌ విద్యాసంస్థల కొత్త శాఖను ఆయన సోమవారం ప్రారంభించారు. మిథునం లాంటి చిన్న చిత్రాలను అందరూ ఆదరించాలని కోరారు.