అద్భుత విజయం సాధించారు… హద్దులు దాటకండి: కేజ్రీవాల్
హైదరాబాద్ (జనంసాక్షి) : దిల్లీ ఎన్నికల్లో ఘనవిజయం దిశగా దూసుకుపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కార్యకర్తలను సున్నితంగా హెచ్చరించారు. విజయానందం గర్వంగా, అహంకారంగా మారవద్దని, హద్దులు దాటవద్దని ఆయన సూచించారు. సత్యమార్గాన నడిచి అద్భుత విజయం సాధించామని, ఈ విజయానికి విశ్వ శక్తులన్నీ తమ తోడ్పాటునందించాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దిల్లీ ప్రజలకు ఆయన మనః పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.