అద్వానీతో సంగ్మా భేటీ
ఢిల్లీ : మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే శుక్రవారం ఆయన భారతీయ జనతాపార్టీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీతో భేటీ అయ్యారు.బీజేడీ, ఏఐఏడీఎంకే తదితర ప్రాంతీయ పార్టీల ద్వారా రాష్ట్రపతి అభ్యర్థిగా నామినెట్ అయిన సంగ్మా తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా అద్వానీని కోరారు. మద్దతు విషయంలోనే ప్రధానంగా వీరిమధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గిరిజన, క్రైస్తవ అభ్యర్థిగా తనను తాను పరిచయం చేసుకుంటున్న సంగ్మా తన అభ్యర్థిత్వాన్ని బలపర్చాల్సిందిగా కోరుతూ ఇప్పటికే వివిధ పార్టీల నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే.