అధికారంలోకి వస్తే శాశ్వత నీటి పథకం

నిజామాబాద్‌, నవంబర్‌ 29 : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రారంభించిన వస్తున్నా మీ కోసం గురువారం నిజామాబాద్‌ జిల్లాలో రెండవ రోజుకు చేరుకుంది. గంట ఆలస్యంగా ప్రారంభమైన బాబు పాదయాత్రకు అడుగడుగునా గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. పిట్లం మండలం నాగంపల్లి తండాలో ఆయన గ్రామస్థులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మంజీరా, గోదావరి నదిల నుంచి నీటిని మళ్లించి శాశ్వతంగా నీటిని అందిస్తామని, బెల్టు షాపులను రద్దు చేస్తామని ప్రకటించారు. వ్యవసాయ రుణమాఫీ ఎట్టి పరిస్థితుల్లో చేస్తామని, కొన్ని పార్టీలు రుణమాఫి సాధ్యం కాదంటూ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. దేశంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని, వీటిని విద్యార్థులు, యు వకులు అరికట్టులని ఆయన కోరారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నానని, రాజకీయం కోసం కాదని స్పష్టం  ఏచేశారు. అంతకు ముందు చంద్రబాబు బ్రహ్మంగారి ఆలయంలో ప్రత్యేక పూజసలు నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  తదితరులు బాబు వెంట ఉన్నారు.

కాంగ్రెస్‌, టిడిపిలకు బుద్దిచెప్పాలి : నాగంతెలంగాణపై అధికార కాంగ్రెస్‌ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు దోబుచులాడుతున్నాయని తెలంగాణ నగారా  సమితి  అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. నాగం చేపట్టిన భరోసా యాత్ర గురువారం జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో జరిగింది. ఈ సందర్భంగా నగారా సమితి నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ జేఏసీ నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగం జనార్దన్‌రెడ్డి బిక్కనూరు, కామారెడ్డి, సదాశివనగర్‌, నిజామాబాద్‌లో జరిగిన బహిరంగసభల్లో ప్రసంగించారు. తెలంగాణను అడ్డుకుంటున్న రెండు పార్టీలకు బుద్దిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు, విద్యార్థులు ఎవరూ బలిదానం చేసుకోవద్దని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.