అధికారులు నిర్లక్ష్యం పై కలెక్టర్ ఆగ్రహం

చెరువు కట్ట మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాజంపేట్ మండల కేంద్రంలో ఊర చెరువు కట్ట ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురైన విషయం తెలుసుకున్న కలెక్టర్ గురువారం చెరువు కట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. అధికారులు సమన్వయంతో పనిచేసి చెరువు కట్ట మరమ్మత్తు పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. అలుగు సమీపంలో మరమ్మత్తులు చేయించాలని సూచించారు. కట్ట కుంగిపోయిన చోట మొరం పోయించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో  మండల స్థాయి అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు వీఆర్ఏలు పాల్గొన్నారు.