అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలి
వరద పరిస్థితులపై సవిూక్షించిన మంత్రి ఎర్రబెల్లి
జనగామ,జూలై14(జనం సాక్షి ): వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. స్టేషన్ ఘన్?పూర్ మండలం సముద్రాల, ఇప్పగూడెంలో పర్యటించిన మంత్రి హరిత హారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం వర్షాలు, వరదల తాజా పరిస్థితుల పై జనగామ జిల్లా కలెక్టరేట్ లో సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… వరదల వల్ల ఇళ్లు కోల్పొయినవారికి పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు ముందు జాగ్రత్య చర్యలు చేపట్టేలా ఆదేశించామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ మేరకు అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలని, ఎప్పటికప్పుడు సవిూక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ శివ లింగయ్య ను మంత్రి అదేశించారు. మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం కలిగిన గ్రామాల్లో ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా మంచి నీటిని సరఫరా చేయాలని కోరారు. ఈ సమావేశంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్, అడిషనల్ కలెక్టర్లు, జెడ్పీ సీఈఓ, డీపీఓ, డీఎం అండ్ హెచ్‌ఓ, పోలీస్ పలువు అధికారులు పాల్గొన్నారు.