అధికారుల తనిఖీల్లో 92 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
హైదరాబాద్ జనంసాక్షి : నెల్లూరు జిల్లా అనంతసాగరం, మర్రిపాడు అటవీ ప్రాంతంలో అధికారులు తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో 92 ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 11 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.