అధికారుల పనితీరుపై అసంతృప్తి..
-అదనపు కలెక్టర్ అరుణశ్రీ
మల్లాపూర్
,(జనంసాక్షి) జులై :29 మండల కేంద్రంతో పాటు వాల్గొండ తో గ్రామాలలో జిల్లా లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ అరుణశ్రీ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా వాల్గొండ గ్రామంలోని గోదావరి నదిని పరిశీలించారు. వరదల కారణంగా పుష్కర గాట్లపై పై పేరుకుపోయిన చెత్తను తొలగించాలని అధికారులు ఆదేశించారు. అలాగే గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి, నర్సరీ పరిశీలించి సంబంధిత అధికారుల పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొత్తదామరాజు పల్లి లో వరదల కారణంగా కొట్టుకుపోయిన రహదారిని నర్సరీని పరిశీలించి పలు సూచనలు అందించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి మేను ప్రకారం భోజనం అందిస్తున్నారో లేదో అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పై విద్యార్థులకు భోజనం సరిగా లేదని విద్యార్థులు చెప్పడంతో వారి పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూడు రోజుల్లో మధ్యాహ్న భోజన కార్మికులను మార్చి విద్యార్థులు పాఠశాలల్లోనే భోజనం చేసేలా చూడాలని అధికారులు ఆదేశించారు. ఎస్టీ మినీ గురుకులాన్ని సందర్శించి పాఠశాలలో విద్యార్థులకు బోధిస్తున్న తీరును అడిగి తెలుసుకొని మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనంలో చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మెగా పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి ప్రకృతి వనంలో నాటిన మొక్కల తీరు సరిగా లేదని నాటిన మొక్కల కంటే పిచ్చి మొక్కలే ఎక్కువగా ఉన్నాయని అధికారుల పనితీరుపై ఆ సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని తనిఖీ చేసి అదనపు వాక్సినేషన్ ప్రక్రియపై ఆరాధిసి సీజనల్ వ్యాధుల పట్ల ఎలాంటి చర్యలు చేపడుతున్నారు వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు వాల్గొండ గోదావరి నది తీరాన ఉన్న అతి పురాతనమైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవలాయంలో ఆమె ప్రత్యేక పూజలు జరిపించారు. వీరి వెంట ఎంపీపీ సరోజన ఆదిరెడ్డి జెడ్పిటిసి శ్రీనివాస్ సర్పంచులు గంగు రాజన్న ఎంపీటీసీ సుజాత నరేష్ రెడ్డి సర్పంచ్ శ్రీనివాస్, లతోపాటు మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు