అధికారుల సహాయంతో పెద్దలు బడా పారిశ్రామికవేత్తలు నిరుపేదల భూములు కొట్టేయాలని చూస్తున్నారు.
మధుర నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి
రంగారెడ్డి / ఇబ్రహీంపట్నం, (జనం సాక్షి):- ఆబ్దుల్లాపూర్ మెట్టు మండలం తట్టి అన్నారం రెవెన్యూ గ్రామం మధుర నగర్ కాలని ప్లాట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏ ఓ గారికి మధుర నగర్ లోని ప్లాట్ల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ముందర బాధితులతో కలిసి నిరసన కార్యక్రమ క్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తట్టి అన్నారం రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్లు 108,109, 110, 111 లోని 70 ఎకరాల 39 గుంటల భూమి పట్టాదారు అయిన మద్ది సత్యనారాయణ రెడ్డి 1982 లో దాదాపు 840 ప్లాట్లతో వెంచర్ చేసి ప్లాట్లను అమ్మకం చేయడం జరిగింది. ఇట్టి భూమిని అధికారులతో కలిసి కొంతమంది రాజకీయ నాయకులు ఆక్రమించుకోవాలని చూస్తున్నారన్నారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో ప్లాట్లను కొన్న కొనుగోలుదారులు ఈ భూమి ఆన్లైన్ రికార్డులలో వారి పేరిట లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ సమస్యపై ఇప్పటికే కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఈ భూమిని ఈ భూమిని ఆక్రమించుకోవడానికి సహకారం అందించిన అధికారులపై చర్యలు తీసుకొని తగు విచారణ జరిపి బాధితులకు వారి భూమిని అప్పజెప్పాలని కోరమన్నారు. ఇక్కడ న్యాయం జరగకపోతే చట్టపరంగా ఎంత దూరమైన వెళ్లి బాధితుల కుటుంబ సభ్యులతో కలిసి సుమారు 3000 మందితో కలెక్టరేట్ ముందు ఆందోళన కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధురా నగర్ కాలనీ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోషియేషన్ ప్రతినిథులు సిహెచ్ సత్యనారాయణ , అంజనేయులు, పి .నరసింహ రెడ్డి , ముద్దగౌని రంజీత్ గౌడ్ , మనీష్ గౌడ్ , అమరా రెడ్డి , సమద్ , రాజశేఖర్ రెడ్డి , సంజయ్ , సతీశ్ కుమార్ , శ్రీనివాస్ యాదవ్ , సునీల్ సాగర్ , మహేందర్ రెడ్డి , నరేందర్ రెడ్డి తదితరులున్నారు.
Attachments area
|