అధిక సాంధ్రత పత్తి పంటల పరిశీలన..

మద్దూరు (జనంసాక్షి) ఆగస్టు 05
: మద్దూరు మండల పరిధిలోని నర్సయపల్లి, చేర్యాల పట్టణ శివారు గ్రామాలలో అధిక సాంధ్రత పద్దతిలో సాగు చేసిన పత్తి పంటలను శుక్రవారం వ్యవసాయ విస్తరణ అధికారి రవలి పరిశీలించారు. అధిక సాంధ్రత పత్తి పంటలో ఎకరానికి 25 నుండి 28 వేల మొక్కలు సాగు చేసి, సరైన సమయానికి మేపేక్వాట్ క్లోరైడ్ పిచికారీ 45,65 రోజులకు స్ప్రే చేయడం వలన, పంట దిగుబడి ఒకేసారి వస్తుందని, మరియు రైతులు యాసంగిలో రెండవ పంట వేసుకునే అవకాశం ఉంటుంది అని వివరించారు. నుజువీడు ఫీల్డ్ ఆఫీసర్ గజ్వెల్ రాజు, పంటలని పరిశీలించి, రైతులకు తగు సూచనలు అందించారు.