అధిక స్థానాలు మేమే గెలుస్తాం
` కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనం ఖాయం
` కారు గ్యారేజీకే పరిమితం
` ఎన్‌డీఏకు 400 సీట్లు పక్కా : లక్ష్మణ్
` తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం: ఈటల రాజేందర్
హైదరాబాద్(జనంసాక్షి):త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో బీఆర్‌ఎస్ విలీనం అవుతుందని రాజ్యసభ సభ్యులు కే. లక్ష్మణ్ అన్నారు. కారు పని అయిపోయిందని విమర్శించారు. జాకీ పెట్టిన లేపినా కారు లేచే ప్రసక్తే లేదని చెప్పారు. భవిష్యత్ అంత బీజేపీ దేనని ప్రజలంతా బీజేపీవైపే చూస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ లో లక్ష్మణ్ విూడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు బీజేపీకే వస్తాయని తెలిపారు. నాలుగు విడతల్లోనే బీజేపీ మెజారిటీ సాధించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతి పక్ష హోదా కూడా దక్కుతుందో లేదో చూడాలని కే. లక్ష్మణ్ అన్నారు. రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మండం లేదని రాష్టాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారని ఆరోపించారు. కేవలం ఓట్ల కోసం అడ్డగోలు హావిూలు ఇచ్చి రాష్టాన్న్రి నాశనం చేస్తున్నారని లక్ష్మణ్ తెలిపారు. ఇకపోతే బీజేపీకి 370, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు రాబోతున్నాయన్నార. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హావిూలను, దేవళ్లపై పెట్టిన ఒట్టును ప్రజలు నమ్మలేదన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉంటే, హావిూలు ఎలా అమలుచేస్తారని విమర్శించారు. హావిూల అమలుకు ప్రతి ఏటా రూ. 2 లక్షల కోట్లు కావాలని వివరించారు. సీఎం రేవంత్ సైతం కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలోకి తీసుకెళ్తోందని ఘాటుగా స్పందించారు. ధరణి సమస్యల పరిష్కారానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. గ్యారేజ్ నుంచి కారు బయటకు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు దక్కడమే గగనమని తెలిపారు. కాంగ్రెస్‌లో, బీఆర్‌ఎస్ విలీనం ఖాయమన్నారు. రెండు పార్టీలు బీజేపీ గెలుపును ఆపేందుకు యత్నించాయని ఆరోపించారు. కానీ తెలంగాణ ప్రజలు మోదీనామస్మరణ చేశారన్నారు. రైతు రుణమాఫీ చేయకపోతే సీఎం రేవంత్ సర్కారుకు ఆగస్ట్ సంక్షోభం తప్పదని హెచ్చరించారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చుతుందన్న సీఎం రేవంత్ మాటలను ప్రజలు నమ్మలేదని చెప్పారు. హావిూలు అమలుచేయకపోతే ప్రజలు కాదు, కాంగ్రెస్ నేతలే తిరగబడుతారని తెలిపారు.
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జననాడి ఈవీఎంలలో నిక్షిప్తం చేసింది. వచ్చే నెల 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ఈ లోపుగానే ఎవరి అంచనాల్లో వారు మునిగిపోయారు. ఈ నేపథ్యంలో మల్గాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి జూన్ 4న తెలియని నిశ్శబ్ద విప్లవం ఫలితం ఉంటుందని జోస్యం చెప్పారు. బీజేపీ ఊహించని రీతిలో సీట్లు సాధించనుందని ధీమా వ్యక్తం చేశారు. ఈవీఎంలలో ఓటరు తీర్పు నిక్షిప్తమైంది. జననాడిపై ఎవరి లెక్కల్లో వారు మునిగిపోయారు. ప్రజాతీర్పు తమవైపే ఉందంటూ మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 10 నుంచి 12 స్థానాలు గెలుస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెబితే బీఆర్‌ఎస్ అభ్యర్థులే ఎక్కువ స్థానాల్లో గెలుస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు. డబుల్ డిజిట్‌ను దాటుతామని బీజేపీ పూర్తి విశ్వాసంతో ఉంది. జూన్ 4వ తేదీన తెలియని నిశ్శబ్ద విప్లవం ఉంటుందని మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. పోలింగ్ సరళి బీజేపీకి చాలా పాజిటివ్‌గా ఉందని పేర్కొన్నారు. అందరూ అనుకున్న దానికి భిన్నంగా పోలింగ్ జరిగిందని వివరించారు. ఊహించని రీతిలో ఫలితాలు సాధించబోతున్నామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలనలోనే దేశం ముందుకు పోతుందని, ఓటేసిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీ ఇచ్చిన హావిూలు తప్పకుండా నెరవేర్చుతామని హావిూ ఇచ్చారు.రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రజల నుంచి సానుకూలంగా స్పందన వచ్చింది. కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించినప్పుడు 12 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారని అన్నారు. అవి కచ్చితంగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్ బీజేపీనేనని ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తమ పాత్ర పోషిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో విలువలు లేని వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. వరంగల్‌లో మోదీ ప్రధాని కావాలన్న దేశ ప్రజల కాంక్ష ముందు కాంగ్రెస్ కుయుక్తులు పని చేయలేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు. 2 నుంచి 3 లక్షల మెజార్టీతో గెలుస్తామని మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డి.కె.అరుణ ధీమా వ్యక్తం చేశారు.