అధైర్య పడకండి ఆదుకుంటాం
ప్రభుత్వ విధి విధానాల ప్రకారం పరిహారం చెల్లింపు ఎంఎల్ఏ బండ్ల కృష్ణ మోహన్
సెప్టెంబరు28 గట్టు( జనంసాక్షి)
గద్వాల నియోజకవర్గం లోని కె.టి దొడ్డి మండలం పరిధిలో మల్లాపురం తండా సమీపంలో గల గట్టు ఎత్తిపోతల పథకం నిర్వాసితుల తో ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి హాజరయ్యారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ నల్ల సోమందనాద్రి గట్టి ఎత్తిపోతల పథకంలో భూములు పోయిన రైతులు ఆధార్య పడకండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటూ అందరి రైతులను ఆదుకుంటుందని అన్నారు
కుచినెర్ల, మల్లాపురం, మల్లాపురం తండా, రాయపురం గ్రామాల రైతుల త్యాగాల వల్ల కేటి దొడ్డి, గట్టు మండలాల్లోని వేలాది మంది రైతుల పొలాలు పచ్చగా మారబోతున్నాయని తెలిపారు ప్రాజెక్టు నిర్మాణం పనులు చురుకుగా కొనసాగుతున్నాయని, పనులను అడ్డుకోవడం సరికాదని సూచించారు. నాపై నమ్మకం ఉంచి అవకాశం కల్పిస్తే రైతుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి రెండు, మూడు నెలలొ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రిజర్వాయర్ లో 80% ప్రభుత్వ భూమి, మిగతా 20 శాతం పట్టా భూమి పోతుందని, ఆయన అందరికీ ఎకరాకు సుమారు 8 లక్షల వరకు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు
కొందరు నియోజకవర్గ అభివృద్ధిపై నిత్యం అసత్యాలు మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారని అలాంటివారిని దగ్గరకు రానివ్వకుండా హెచ్చరించారు .
ఆర్డీవో గారు మాట్లాడుతూ
రైతులు ఎవరు ఆందోళన చెందకండి, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రతి రైతుకు పరిహారం వచ్చేలా చూస్తాము. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా వినతి పత్రం రూపంలో నా దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ్ కుమార్ జెడ్ పి టి సి రాజశేఖర్ వైస్ ఎంపీపీలు రామకృష్ణ నాయుడు సుదర్శన్ రెడ్డి, RDO, MRO, నీటి పారుదల శాఖ E.E, మండలం పార్టీ అధ్యక్షులు రామకృష్ణ రెడ్డి, ఉరుకుందు, మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు, అధికారులు , తదితరులు పాల్గొన్నారు.
|