అనంతగిరి రహదారి ఎంత భద్రం

విస్తరణకు నోచని అనంతగిరి ఘాట్ రోడ్డు
 తరచూ ప్రమాద ఘటనలు
 పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణం
 ఇప్పటికైనా పట్టించుకుంటే మేలు
* అనంతగిరి మీదుగా తాండూర్ కు వెళ్తున్నప్పుడు రెండు నెలల క్రితం ఆర్టీసీ బస్సు బ్రేకులు పనిచేయలేదు. డ్రైవర్ చాకచక్రంతో బస్సును ప్రమాదం నుంచి అదుపు తప్పించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
* ఇదే ప్రాంతంలో గత ఆదివారం అదుపుతప్పి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
 వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి నవంబర్ 22
 పర్యటకంగా అభివృద్ధి చెందుతున్న అనంతగిరి కి ఇటీవల ప్రజలు వాహనాల తాకిడి పెరిగింది. మరోవైపు తాండూర్ కర్ణాటక వెళ్ళడానికి గుట్టల మీదుగాని ప్రధాన రహదారి ఉండటంతో నిత్యం రాకపోకలు సాగించే వాహనాల  సంఖ్య వేలాదిగా పెరిగింది. గుట్ట పైకి ఎక్కడానికి భారీ వాహనాలకు ఇబ్బంది కలుగుతుందని గతంలో కెరెల్లి నుంచి బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మీదుగా వికారాబాద్ లోకి దారి మళ్ళించారు.ఫలితంగా కొంత భయం తీరింది. అయినా ఆర్టీసీ బస్సులో ఇతర ప్రజా రవాణా వాహనాలు నిత్యం తిరుగుతూ ఉన్నాయి. ఈ రహదారి నిర్వాణపై అటవీశాఖ అధికారులు భవనాల శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో విస్తరణ నోచుకోలేదు. ఇరుకైన రోడ్లలో వచ్చి పోయే వాహనాలు నిలిపి తప్పించుకోవాల్సిన పరిస్థితి ఉన్నాయి. అనంతగిరి మీదుగా సుమారు 6 కిలోమీటర్ల పొడవున ఘటో రోడ్డు ఉంది. రాజీవ్ నగర్ నుంచి అనంతపద్మనాభ స్వామి దేవాలయం దాటెంతవరకు రెండు వరుసలో దారి ఉంది. కొండలు దిగే క్రమంలో రహదారి విస్తరణకు అవకాశం లేకపోవడంతో విడిచిపెట్టారు. కనీసం రహదారికి దిగువ లోయ వైపు రక్షణ కూడాను సపోర్టు వాళ్లను నిర్మించిన భద్రంగా ఉండేది. ఇక్కడ అటువంటి నిర్మాణాలు ఏమీ లేవు. బసవేశ్వర స్వామి విగ్రహం ముందు ఒక మలుపు తర్వాత  మరో మలుపు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే తాండూర్ నుంచి వికారాబాద్ వచ్చే దారిలో హరిత రిసార్ట్ దాటిన తర్వాత ఒకే దగ్గర రహదారి పాముల వంకలను తిరుగుతూ ఏటవాలుగా ఉంటుంది. ఇక్కడ ఇలాంటి రక్షణ కూడా లేవు సూచికలు కూడా లేవు. బుగ్గ రామలింగేశ్వర దేవాలయం రహదారిలో సైతం 2 మూలమలుపులు చిన్నచిన్నగా ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. ఈ రహదారిలో భారీ వాహనాలు మాత్రమే ప్రయాణిస్తాయి ఆర్టీసీ బస్సులు ప్రయాణించకపోవడంతో పెద్దగా ప్రమాదాలు వెలుగులోకి రావడం లేదు. అనంతగిరి ఘాట్ రోడ్డు ప్రమాదం నేపథ్యంలోనైనా అధికారులు ప్రజాప్రతినిధులు  అనంతగిరిపై రహదారుల విస్తరణ మలుపుల దగ్గర సూచికలు ఏర్పాటు రక్షణ గోడల నిర్మాణం చేపట్టాలని పలువురుకోరుతున్నారు.
 ఫోటోలు
1. ప్రమాదంలో బోల్తా పడిన బస్సు
2. ప్రమాదంగా మారిన ఘాట్ రోడ్డు

తాజావార్తలు