అనవసర రాద్దాంతాలు మానండి
– ఎప్పుడూ తగ్గాలో.. ఎప్పుడు పెరగాలో వ్యూహం తెలిసిన నాయకుడు కేసీఆర్
– ఎంపీ కవిత
హైదరాబాద్,ఆగస్టు 27(జనంసాక్షి): రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ప్రతిపక్షాలకు కనీస అవగాహనలేదని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు వీటిపైన ఎప్పుడైనా అవగాహన చేసుకున్నారా అన్న అనుమానం కలుగుతోందన్నారు. శనివారం ఆమె తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఏదో ఓ రాయివిూద వేద్దామన్న తీరు సరికాదన్నారు. వమిర్శలకు ప్రాతిపదిక ఉండాలన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం గతంలో జరగకున్నా జరిగిందనడం వారి రాజకీయ దివాళాకోరుతనమన్నారు. తమ్మిడిహట్టిపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ నేత జానారెడ్డికి ఆమె ధన్యావాదాలు తెలిపారు. తమ్మిడిహట్టిపై మహారాష్ట్రతో 152 విూటర్లకు ఒప్పందం జరగలేదని జానారెడ్డి స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మిగతా కాంగ్రెస్ నేతలు కూడా జానారెడ్డి బాటలో నడిస్తే బాగుంటుందని హితవు పలికారు. మహారాష్ట్రతో ఒప్పందంతో సీఎం కేసీఆర్ సాధించిదేవిూలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మిడిహట్టి దగ్గర 148 విూటర్లకే కేసీఆర్ సంతకం పెట్టారని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. లోయర్ పెన్‌గంగను తాము నిర్మించలేమని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టును కాంగ్రెస్, టీడీపీ పట్టించుకోలేదని విమర్శించారు. ఫలితంగా ఆదిలాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల రీడిజైన్‌పై కాంగ్రెస్, టీడీపీ రాజకీయం చేస్తున్నాయని ఎంపీ కవిత విమర్శించారు. మహా ఒప్పందంపై జానారెడ్డి, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎంపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రెజెంటేషన్‌లో పసలేదన్నారు. లోయర్ పెన్‌గంగ ఎక్కువభాగం మహారాష్ట్రలోనే ఉందని, దీనిపై మూడు ప్రాజెక్టులకు కేసీఆర్ ప్లాన్ చేశారని వివరించారు. కాంగ్రెస్‌కు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లపై ఉన్న ప్రేమ ప్రాజెక్టులపై లేదని అన్నారు. మేడిగడ్డ మహారాష్ట్ర ఒప్పందంలో ఉంది కనుకే ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. తెలంగాణను ముంచాలని టీడీపీ, కాంగ్రెస్ చూస్తున్నాయన్న ఎంపీ కవిత మహారాష్ట్రకు తెలంగాణ సరెండర్ కాలేదని స్పష్టం చేశారు. పట్టువిడుపులు
ఉండటం మంచి నేతకు ఉండాల్సిన లక్షణమన్నారు. ఆ లక్షణం కేసీఆర్‌కు ఉందన్నారు. సీఎం కేసీఆర్ రైతుల బాగోగులు పట్టించుకున్న వ్యక్తి అని కొనియాడారు. మేడిగడ్డ బ్యారేజీతో రైతుల జీవితాలు మారిపోతాయన్నారు. మేడిగడ్డ బ్యారేజీతో నల్లగొండ ప్రాజెక్టులకు కూడా నీళ్లు ఇవ్వొచ్చని తెలిపారు. కాంగ్రెస్ నేతలకు మొబలైజేషన్ విూద ఉన్న ఇంట్రెస్టు ప్రాజెక్టుల విూద లేదన్నారు. రేవంత్‌రెడ్డి అధిష్ఠానం అమరావతిలో ఉందని ఆయన తెలంగాణ మ్యాప్ చూసి మాట్లాడాలని సూచించారు. టీడీపీ నేత ఎల్ రమణ కనీస అవగాహన లేకుండా లేఖ రాశారని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి, ఎల్ రమణ ఆంధ్రా ప్రయోజనాలు పక్కన బెట్టి తెలంగాణ కోసం పాటుపడాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ¬దా తేవాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నేతలదేనన్నారు. జిల్లాల విభజనపై రాద్ధాంతం చేయాల్సిన అవసరంలేదన్నారు. సమస్యలుంటే సీఎం దృష్టికి తీసుకురావాలని ఆయన వాటిని పరిష్కరిస్తారని వెల్లడించారు.