అనాథ వృద్ధులకు అన్నదానం
కోల్సిటి, జూన్ 12, (జనంసాక్షి):
శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక ఆశ్రమంలో మంగళవారం అనాథ వృద్దులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. టీిఆర్ఎస్ యువజన విభాగం కార్పొరేషన్ అధ్యక్షులు బిక్కినేని నర్సింగరావు – పావని దంపతుల కుమార్తె రినా పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌటం బాబు తదితరులు పాల్గొన్నారు.