అనాధలుగా మారిన అన్నదమ్ములను ప్రభుత్వం ఆదుకోవాలి…

కేసముద్రం సెప్టెంబర్ 18 జనం సాక్షి / మండలంలోని తౌర్య తండ గ్రామ పంచాయతీకి చెందిన అనాధలుగా మారిన ఇద్దరు అన్నదమ్ముల కన్నీటి గాధ ను చూసి స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు.వీరి తండ్రి గుగులోతు ఆలు గత 18 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించగా,ఈనెల 8వ తేదీన తల్లి గుగులోతు భద్రమ్మ విద్యుత్ షాక్ తో మరణించారు.వీరిద్దరి మరణంతో గుగులోతు సురేష్,నరేష్ అన్నదమ్ములు చిన్న వయసులో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలారు.తండ్రి మరణంతో చదివించే స్తోమత లేక తమ తల్లి భద్రమ్మ పదవ తరగతి వరకు చదివించింది.చిన్న వయసులోనే తల్లి తండ్రి, నానమ్మ,తాత అందరినీ కోల్పోయామని వీరిద్దరూ కన్నీరు మున్నీరయ్యారు.అనాధలుగా మిగిలిన వీళ్ళిద్దరికీ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించి,ఇద్దరికీ డబ్బులు బెడ్రూం ఇల్లు మంజూరు చేసి, వీరి విద్యార్హతల తగ్గట్టుగా ప్రభుత్వ ఉద్యోగం కల్పించి వీరిని ఆదుకోవాలని స్థానికులు,శ్రేయోభిలాషులు ఆవేదన వ్యక్తం చేశారు.