అనాధలుగా మారిన పిల్లలకు ఆర్థిక సాయం అందజేసిన విగ్నేశ్వర సేవా సమితి

బోయిన్ పల్లి అక్టోబర్ 16 (జనం సాక్షి )రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పెళ్లి మండలం దుండ్ర పెళ్లి గ్రామానికి చెందిన బిజెపి నాయకులు ఏడెల్లి మల్లేశం గత సంవత్సరం కరోనా తో చనిపోగ గత 20 రోజుల క్రితం మల్లేశం సతీమణి సత్య గుండె నొప్పితో చనిపోవడం జరిగింది తల్లి తండ్రి మరణించడంతో పిల్లలు సంగీత అవినాష్ ఒంటరి వారు అయ్యారు ఈ సందర్భంగా దుండ్రపల్లి లోని విగ్నేశ్వర సేవాసమితి వారు 16 వేల రూపాయల ఫిక్స్ డిపాజిట్ బాండును అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున వారిని ఆదుకోవాలని కోరారు.