అనాధల సంక్షేమ, అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం తీసుకురావాలి.

అనాధలకు ఆసరా పెన్షన్ కల్పించాలి.
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి వరంగల్ ఇంఛార్జి తాళ్ళపల్లి తిరుపతి.
హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి ఆగస్టు25:-
అనాధలకు ప్రతి ఒక్కరు అండగా నిలబడాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతి అన్నారు. గురువారం బాలసముద్రం లోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తిరుపతి మాట్లాడుతూ అనాధలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా గుర్తించి వారికి ఆధార్ కార్డు ఇచ్చి అందులో అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించాలని అన్నారు. అనాధల హక్కుల రక్షణకు అభివృద్ధికి ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఆసరా పెన్షన్ అందించడంతోపాటు పాటుగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర కమిటీ చైర్మన్ రాజారపు ప్రతాప్ అనాధల సంక్షేమ అభివృద్ధి కోసం తాళ్ళపల్లి తిరుపతి చేసిన ప్రతిపాదనను ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనాధ ఆశ్రమ నిర్వాహకుల తో, సామాజికవేత్తలతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించి అనాధల హక్కుల సాధన కోసం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కార్యచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ టౌన్ కన్వీనర్ వెల్ది అనిల్, వర్ధన్నపేట మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రియదర్శిని, వేలేరు మండల అధ్యక్షుడు కీర్తి సురేష్ , వాలంటరీ లు బత్తిని రాజు,రేణుగుంట్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.