అనారోగ్యం తో చిన్నంశెట్టి శోభనాద్రి మృతి
నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
అశ్వరావుపేట అక్టోబర్ 14( జనం సాక్షి ) అశ్వరావుపేట మండలం లోని నారాయణపురం గ్రామంలో శుక్రవారంనాడు అనారోగ్యంతో చిన్నంశెట్టి శోభనాద్రి మృతి చెందారు. అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరావు నారాయణపురంలో శోభనాద్రి భౌతికాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, దమ్మపేట మండల నాయకులు దొడ్డకుల రాజేశ్వరరావు, మోహన్ రెడ్డి, నిర్మల పుల్లారావు, అబ్దుల్ జిన్నాతదితరులు పాల్గొన్నారు