అనార్ధులను ఆదుకోవాడంలోనే సార్ధకత ఉంటుంది.

లయన్స్ క్లబ్ ఫస్ట్ జిల్లా వైస్ గవర్నర్ వి.లక్ష్మి
జహీరాబాద్ సెప్టెంబర్ 2 (జనం సాక్షి)
మానవ సేవయే- మాదవ సేవయని, అనార్ధులను ఆదుకోడంలో సార్ధకత ఉంటుందని లయన్స్ క్లబ్ ఫస్ట్ జిల్లా వైస్ గవర్నర్ వి. లక్ష్మి పేర్కోన్నారు.
జహీరాబాద్ సమీపంలోని ఘర్ దాబా హోటల్ లో నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ సభ్యులకు ఎర్పటు చేసిన అభినందన సమావేశానికి ఆమే ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించారు. ప్రతి ఒక్కరు తాము సంపాదించిన దానిలో కొంత మేర సమాజ ఉపయోగం కోసం వేచ్చించాలని సూచించారు. ప్రజా క్షేమాన్ని దృష్టిలో ఉంచుకోని లయన్స్ క్లబ్ ద్వార పలు స్వచ్చంద కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. జహీరాబాద్ ప్రాంతంలో నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ సభ్యులు సంఘసేవ కోసం కృషి చేయలన్నారు.
లయన్స్ క్లబ్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ భసవేశ్వర్ రావు మాట్లడుతూ త్వరలో లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో జహీరాబాద్ పట్టణంలో ఉచిత నేత్ర వైద్యశాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. జహీరాబాద్ లయన్స్ క్లబ్ ద్వార ఇప్పటి వరకు 300 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లను నిర్వహించడం జరిగిందన్నారు. అంతర్జాతీయంగా మొట్ట మొదటి సారి 1917 సంవత్సరం లయన్స్ క్లబ్ స్థాపించి దేశ విదేశాలలో పలు స్వచ్చంద కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. జహీరాబాద్ లయన్స్ క్లబ్ సభ్యులు సేవ, స్వచ్చంద కార్యక్రమాలను నిర్వహించడం పట్ల వారిని అభినందించారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన సభ్యులు సంఘటితంగా ఉండి కొంత సమయం కేటాయించి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
లయన్స్ క్లబ్ ఫాస్ట్ జోనల్ చైర్మన్ డాక్టర్ నాగరాజ్ పాటిల్ మాట్లడుతూ జహీరాబాద్ ప్రాంతంలో గత 5 సంవత్సరాల క్రితం 20 మంది సభ్యులతో లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జహీరాబాద్ ప్రాంతనికి చెందిన 300 మందికి లయన్స్ క్లబ్ ద్వార ఉచితంగా కంటి ఆపరేషన్లను చేయించినట్లు తెలిపారు. ఎలాంటి సహయ సహకారలు లేని వితంతు మాహీళలు, ఆర్థికంగా వెనుకబడిన మాహీళలను గుర్తించి స్వతహాగా జీవనోపాది పోందేందు కోసం 25 మందికి కుట్టు మీషన్లను ఉచితంగా పంపిణి చేసినట్లు తెలిపారు. జహీరాబాద్ పట్టణం శాంతినగర్ కాలని, ఝరసంగం మండలం పోట్ పల్లి గ్రామంలో రెండు మీనరల్ వాటర్ ప్లాంట్లను నెలకొల్పి నిరుపేదలకు ఉచితంగా మీనరల్ వాటర్ ను అందిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా జహీరాబాద్ ప్రాంతంలో వైద్యశిభిరాలను ఎర్పటు చేసి ఉచితంగా వైద్య చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. త్వరలో జహీరాబాద్ పట్టణంలో లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో మరిన్ని స్వచ్చంద కార్యక్రమాలను నిర్వహించ గలమని తెలిపారు. ఆనంతరం జహీరాబాద్ ప్రాంతంలో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి, ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు షట్కర్ శ్రీకాంత్, మామిడ్గి రాజిరెడ్డి, డాక్టర్ సోహెల్, డాక్టర్ ప్రభు,మాహేష్, శ్రీకాంత్ పాటిల్, డాక్టర్ ప్రతిభ పాటిల్, తదితరులు పాల్గోన్నారు.