అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వైన్ షాప్ కు నోటీసులు జారీ చేసిన పంచాయతీ కార్యదర్శి

జనం సాక్షి రాయికల్ .. జూలై 28.. రాయికల్ మండల్ భూపతిపూర్ గ్రామ శివారులో ప్రభుత్వ భూమి 58 సర్వే నెంబర్ లో గ్రామపంచాయతీ అనుమతి లేకుండా అక్రమ కట్టడం నిర్మించి ప్రభుత్వం ద్వారా మంజూరైన లైసెన్స్ వైన్ షాప్ నిర్వహిస్తున్నారు వాస్తవానికి వైన్ షాప్ మంజూరి వడ్డేలింగాపూర్ పేరు మీద ఉండగా భూపతిపూర్ లో నిర్వహిస్తూ ప్రభుత్వ విధానాలకు తూట్లు పొడుస్తున్నారు దీనిపై స్పందించి గ్రామపంచాయతీ కార్యదర్శి వైన్ షాప్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు ఇలా ఉండగా దీనిపై ఎక్సైజ్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి